హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

TCS: జులై 1 నుంచి విదేశీ ప్రయాణం భారం..ఫారెన్ టూర్ ప్యాకేజీపై 20% ట్యాక్స్

TCS: జులై 1 నుంచి విదేశీ ప్రయాణం భారం..ఫారెన్ టూర్ ప్యాకేజీపై 20% ట్యాక్స్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇక నుంచి విదేశీ ప్రయాణం భారం కానుంది. విదేశాల్లో షాపింగ్ చేయాలన్నా, పర్యటించాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది. విదేశీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచడమే ఇందుకు కారణం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

TCS: ఇక నుంచి విదేశీ ప్రయాణం(Foreign tour) భారం కానుంది. విదేశాల్లో షాపింగ్ చేయాలన్నా, పర్యటించాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది. విదేశీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచడమే ఇందుకు కారణం. జులై 1 నుంచి కొత్త ట్యాక్స్(New Tax) రేటు వర్తించనుంది. ఇదివరకు విదేశీ చెల్లింపులపై ట్యాక్స్ 5శాతం విధిస్తే జులై 1నుంచి ఇది 20శాతంగా ఉండనుంది. దీంతో కస్టమర్లపై భారం పడనుంది.

వీటిపై ట్యాక్స్..

చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు విదేశాలకు టూర్ వెళ్తుంటారు. అక్కడే షాపింగ్ కూడా చేస్తుంటారు. ఇలా విదేశాల్లో చేసే చెల్లింపులపై లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్(LRS) కింద ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS) అని వ్యవహరిస్తుంటాం. విదేశీ చెల్లింపులు చేసినప్పుడు టీసీఎస్ రూపంలో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. విదేశీ చదువులు, మెడికల్ ట్రీట్‌మెంట్‌, షాపింగులు, తదితరాలపై ఈ టీసీఎస్ వర్తిస్తుంది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ టీసీఎస్ పరిమితిని 5 శాతం నుంచి 20శాతానికి పెంచింది. అంటే 20లక్షలు ఖర్చు చేస్తే ఇదివరకు రూ.లక్ష మాత్రమే ట్యాక్స్‌గా చెల్లించేంది. ఇకనుంచి రూ.4లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక అలా కుదరకపోవచ్చు..

విదేశీ చెల్లింపుల చేసే సమయంలో టీసీఎస్ డిడక్ట్ అవుతుంది. ఇలా చెల్లించిన ట్యాక్స్‌ని ఐటీ రిటర్న్స్‌ ద్వారా తిరిగి పొందే వీలుంటుంది. దీంతో చాలామంది ఎక్కువ వాల్యూ కలిగిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ట్యాక్స్ 5శాతం మాత్రమే పడుతుండటంతో.. ఇలా చెల్లించిన పన్ను మొత్తాన్ని ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేసి లబ్ధి పొందుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలా చేస్తున్న చెల్లింపులను ట్రాక్ చేయడానికే కేంద్రం టీసీఎస్ శాతాన్ని 20శాతానికి పెంచినట్లు సమాచారం.

వీటిలో మార్పు లేదు..

ఎడ్యుకేషన్ , మెడికల్ ట్రీట్‌మెంట్‌ల కోసం రూ.7లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో విదేశీ చెల్లింపులు చేసిన వాటికి టీసీఎస్ శాతాన్ని మార్పు చేయలేదు. వీటిపై 5శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చదువు కోసం లోన్ తీసుకుంటే రూ.7లక్షల కన్నా ఎక్కువ చెల్లింపులపై 0.5శాతం టీసీఎస్‌ని విధిస్తోంది.

ప్రత్యేకతల దేశం భూటాన్.. అందరికీ ఉచిత ఆహారం, వసతి, వైద్యం.. పెద్ద కూతురికి ఆస్తి

నిపుణులు ఏమంటున్నారు..?

చాలామంది ట్యాక్స్ రూపంలో అదనపు ప్రయోజనం పొందుతుండటం వల్లే కేంద్రం టీసీఎస్ శాతాన్ని పెంచినట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాక్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి ఆర్బీఐకి కేంద్రం అదనపు బాధ్యతలు అప్పజెప్పిందని చెబుతున్నారు. విదేశీ చెల్లింపులు చేసే సమయంలోనే టీసీఎస్‌కు సంబంధించి ఓ పాప్ అప్ మెసేజ్ చూపించే అవకాశం ఉండొచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. ఉదాహరణకు 10వేల డాలర్లు చెల్లింపు చేయాల్సి ఉంటే 20శాతం ట్యాక్స్‌తో కలిపి మొత్తం బిల్లు 12వేల డాలర్లుగా చూపించొచ్చని చెబుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ మాదిరే ఈ ప్రక్రియ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

చెల్లింపులపై నిఘా..

సాధారణంగా ఇంటర్నేషనల్ క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులపై ఆర్బీఐ ట్రాక్ చేస్తుంటుంది. లాటరీ టికెట్ కొనడం వంటి నిషేధిత పనుల కోసం కార్డుల ద్వారా చెల్లించకూడదు. ఇకపై చెల్లింపులను ట్రాక్‌ చేయడంతో పాటు టీసీఎస్‌ని వసూలు చేయనుంది.

First published:

Tags: Foriegn, Taxes, Tourism

ఉత్తమ కథలు