Top Headlines | అమిత్ షాకు కరోనా నుంచి క్రికెటర్లకు బీసీసీఐ బకాయిల వరకు..

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల ముఖ్యాంశాలు.

news18-telugu
Updated: August 2, 2020, 8:06 PM IST
Top Headlines | అమిత్ షాకు కరోనా నుంచి క్రికెటర్లకు బీసీసీఐ బకాయిల వరకు..
News18Telugu
  • Share this:
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో అమిత్ షా చికిత్స పొందుతున్నారు. Full Story

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. భన్వరీలాల్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చెక్ చేయించుకోగా కరోనా వచ్చినట్టు తేలింది. లక్షణాలు తక్కువగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండమని వైద్యులు సూచించారు. Full Story

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో షిప్ యార్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే, వారికుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. Full Story

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8555 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,764 కి పెరిగింది. గత 24 గంటల్లో ఏపీలో 67 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1474కి పెరిగింది. Full Story

అమరావతి కోసం టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. Full Story

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం నాయక్ స్థానిక రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిమ్స్ లో ఖాళీల భర్తీని స్థానిక నాయకులు చేయొద్దంటున్నారని అన్నారు.  Full Story

ప్రైవేటు కంపెనీలు నడిపే రైళ్ల చార్జీలను వారే స్వయంగా నిర్ణయించుకుంటారని, చార్జీల పెంపుదలపై రైల్వే శాఖ జోక్యం ఉండదని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఛార్జీల ఆయా కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. Full Storyధరతో కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ ఇచ్చిన వివరాలను తనిఖీ చేయండి. 5 లక్షల రూపాయలలోపు ఉన్న 10 ఉత్తమ కార్ల గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాము. Full Story 

భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం మనదేశ కరెన్సీ నోట్లు, కాయిన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ కింగ్ డబ్ తయారు చేసే కరెన్సీ కాయిన్స్ మీద కూడా మహాత్ముడి చిత్రం కొలువుదీరనుంది. Full Story 
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading