ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో మరోసారి గొడవ జరిగింది. యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తున్న వారి మీద కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఐషా ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం 5 గంటల సమయంలో విద్యార్థులు మార్చ్ నిర్వహిస్తుండగా సుమారు 50 మంది వ్యక్తులు ముసుగులు ధరించి, చేతిలో రాడ్లు పట్టుకుని సబర్మతి హాస్టల్లోకి చొరబడ్డారు. ఐషా ఘోష్ మీద తీవ్రంగా దాడి చేశారు.
ఐషా ఘోష్ తల నుంచి రక్తం కారుతున్న వీడియో బయటకు వచ్చింది. ‘కొందరు ముసుగు వేసుకుని రాడ్లతో బీభత్సం దాడి చేశారు. నాకు రక్తం వస్తుందన్న సంగతి కూడా నాకు తెలీదు. అసలు నేను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేను. నా మీద క్రూరంగా దాడి చేశారు.’ అని ఘోష్ తెలిపింది. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ప్రొఫెసర్ సుచరిత సేన్ మీద కూడా ముసుగు ధరించిన వారు దాడి చేశారు. ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జేఎన్యూలో పెంచిన ఫీజులను తగ్గించాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమ మీద ఏబీవీపీ దాడి చేసిందని ఆరోపించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.