మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై... ఇవీ విశేషాలు

Chennai Metro Rail : మెట్రో రైల్ అంటే చెన్నై వాసులకు చాలా ఇష్టం. అక్కడ చాలా మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు వారికి ఫ్రీ వైఫై అందుబాటులోకి రానుంది.

news18-telugu
Updated: November 25, 2019, 8:15 AM IST
మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై... ఇవీ విశేషాలు
మెట్రో రైళ్లలో ఫ్రీ వైఫై... ఇవీ విశేషాలు
  • Share this:
Chennai Metro Rail : ఈ రోజుల్లో స్మార్ట్ మొబైల్స్, వాటికి వైఫై అన్నది కామన్. ఐతే... ప్రతీ ఒక్కరూ రోజువారీ ఉన్న వైఫైని ఏ సినిమా చూడటానికో, వీడియోలు చూడటానికో వాడగానే... అది త్వరగా అయిపోతుండటంతో... మరింత వైఫై ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఫ్రీ వైఫై ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇది నిజం చేస్తూ చెన్నై మెట్రో రైలు నిర్వాహకులు... ఉచిత వైఫైని డిసెంబర్ నుంచీ తేవబోతున్నారు. ఈ ఫ్రీ వైఫైతో చెన్నైలోని అన్ని మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూ ఫ్రీగా సినిమాలు, షోలు, వీడియోలూ అన్నీ చూడొచ్చు. ఇప్పటికే అక్కడి మెట్రో స్టేషన్లలో ఫ్రీ వైఫై ఉంది. ఈ ఫ్రీ వైఫై పొందేందుకు ప్రత్యేక యాప్ తయారుచేశారు. దాన్ని డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకున్నాక... యాప్ ఓపెన్ చేసి తెలుగు, తమిళం, హింది, మలయాళం సినిమాలు, పాటలూ చూడొచ్చు. ఇలాంటి ఫెసిలిటీ హైదరాబాద్ మెట్రో రైళ్లలో కూడా కల్పించాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు.

ఇక హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ఓ అప్‌డేట్ ఉంది. హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో రైల్ మూడో కారిడార్ నవంబర్ 29 (శుక్రవారం)న అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ హైటెక్ సిటీ వరకు మాత్రమే మెట్రో రైలు వెళ్తోంది. ఇప్పుడు అక్కడి నుంచీ రాయదుర్గం వరకూ అంటే మైండ్ స్పేస్ వరకూ వెళ్లనుంది. అందువల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డైరెక్టుగా మైండ్ స్పేస్ దగ్గర వరకూ మెట్రో రైల్లో వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. ఈ అదనపు ట్రాక్ వల్ల... మరో 40వేల మంది ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైటెక్ సిటీ మెట్రో రైలుకు ప్రయాణికుల రద్దీ బాగానే ఉందంటున్నారు.

 

Pics: జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ క్యూట్ స్టిల్స్

ఇవి కూడా చదవండి :

నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సుప్రీంకోర్టు ఏం చెబుతుంది?Health Tips : జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన 7 చిట్కాలు

Health Tips : నిమ్మకాయ తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు... ఇలా చెయ్యండి...

Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>