మహిళలకు రాఖీ కానుక...బస్సుల్లో ఉచిత ప్రయాణం
అక్టోబరు 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇకపై ఢిల్లీ రవాణాశాఖ పరిధిలోని అన్ని బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు.
news18-telugu
Updated: August 15, 2019, 5:06 PM IST

నమూనా చిత్రం
- News18 Telugu
- Last Updated: August 15, 2019, 5:06 PM IST
రక్షాబంధన్ వేళ మహిళలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కానుక ప్రకటించారు. ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 29 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇకపై ఢిల్లీ రవాణాశాఖ పరిధిలోని అన్ని బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. మహిళలకు ఢిల్లీ మెట్రో సర్వీసులు, బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని రెండు నెలల కిందే ప్రకటించారు కేజ్రీవాల్. ఆ మేరకే పథకం అమలుపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీ సీఎం ప్రకటించారు. నగరవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని.. అందుకోసం నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మరో 4 నాలుగు నెలల్లో ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు ఢిల్లీ సీఎం.

దిశ ఘటన ఎఫెక్ట్: బస్సుల్లో సీసీ కెమెరాలు.. పానిక్ బటన్లు
ఢిల్లీలో తెలుగు భాషాభివృద్ధికి అకాడమీ.. సీఎం కేజ్రీవాల్ హామీ
సిటీ బస్సులో సీఎం జర్నీ.. ప్రయాణికులతో ముచ్చట్లు
ప్రధాని మోదీకి బిగ్ షాక్.. కేజ్రీవాల్‌కు నితీష్ కుమార్ మద్దతు
ఢిల్లీలో ఉల్లి లొల్లి... నేటి నుంచీ ప్రభుత్వమే అమ్మకం...
రూ.24కే కిలో ఉల్లి.. రేషన్ షాపులు, వ్యాన్లలో అమ్మకం
Loading...