• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • FREE AT LAST POET VARAVARA RAO AT THE AGE OF 81 RELEASED AFTER LAST MONTHS HIGH COURT BAIL WITH COUNDITIONS NK

"Free At Last": ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయిన వరవరరావు... నెక్ట్స్ ఏంటి?

"Free At Last": ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయిన వరవరరావు... నెక్ట్స్ ఏంటి?

ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయిన వరవరరావు... నెక్ట్స్ ఏంటి? (image credit - twitter)

Varavara Rao: వరవరరావు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ లభించింది. ఆయన నెక్ట్స్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

  • Share this:
    Varavara Rao: విప్లవ రచయిత, సామాజిక వేత్త, 81 ఏళ్ల వరవరరావు... ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కోరెగావ్-భీమా కేసులో... జైలు కెళ్లిన ఆయన 2ఏళ్లకు పైగా జైలులోనే ఉన్నారు. శనివారం ముంబైలోని నానావతీ ఆస్పత్రి నుంచి బెయిల్ పై విడుదలయ్యాయరు. అనారోగ్య కారణాల రీత్యా బాంబే హైకోర్టు గత నెలలో ఆయనకు 6 నెలల బెయిల్ ఇస్తూ... తీర్పు ఇచ్చింది. హై కోర్టు జోక్యం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను ట్రీట్‌మెంట్ కోసం ఆస్పత్రిలో చేర్చింది. తాజాగా వరవరరావు విడుదల సందర్భంగా ఆయన తరపు లాయర్ ఇందిరా జైసింగ్... ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

    బెయిల్‌పై విడుదలైనా... వరవరరావు ముంబైలోనే ఉండాల్సి ఉంది. దర్యాప్తుకి సహకరించేందుకు ముంబైలోనే ఉండాలని హైకోర్టు తెలిపింది. అలాగే తన పాస్‌పోర్టును... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఈ కేసులో సహ నిందితులు ఎవరితోనూ వరవరరావు మాట్లాడేందుకు కోర్టు వీలు కల్పించలేదు. అంతేకాదు... వరవరరావు ఇద్దరి పూచీకత్తుతో... రూ.50,000 బాండ్ సమర్పించాలని కోరింది.

    వరవరరావు 2018 ఆగస్ట్ 28 నుంచి కస్టడీలో ఉన్నారు. విచారణకు సహకరించారు. ఫిబ్రవరి 22న బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తాను మెడికల్ బెయిల్... మానవ హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. జీవించే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుల్లో భాగం అని తెలిపింది.

    "మాకు కాస్త విశ్రాంతి దొరికింది. ఇది మాకు పెద్ద ఉపశమనం. ఎందుకంటే... గత రెండున్నరేళ్లుగా... ఎవరికీ చిన్న రిలీఫ్ కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ఇదే మొదటి రిలీఫ్. మేం ఆనందపడుతున్నాం. అయితే... మేము ముంబైలోనే ఉండాలనే కండీషన్ ఉంది. దాని గురించి మేం ఆలోచిస్తున్నాం. దీనిపై మేం లాయర్లతో మాట్లాడుతాం" అని వరవరరావు కూతురు పావనీ తెలిపారు.


    గత నెల్లో బాంబే హైకోర్టులో... వరవరరావు ఆరోగ్య పరిస్థితని కళ్లకు కట్టినట్లు వివరించారు ఆయన తరపు లాయర్ ఇందిరా జైసింగ్. 365 రోజుల్లో ఆయన... 149 రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారనీ... ఆయన ఇంటికి వెళ్లేందుకు... హైదరాబాద్‌లో తన ఫ్యామిలీతో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు.

    ఇది కూడా చదవండి:Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఈ వారం శుభవార్తా శ్రవణం

    2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గార్ పరిషద్ కాంక్లేవ్ జరిగింది. అందులో... వరవరరావు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కాంక్లేవ్ తర్వాతి రోజే... కోరెగావ్-భీమా వార్ మెమొరియల్ దగ్గర హింస చెలరేగింది. వరవరరావుతోపాటూ... మరో 9 మంది మావోయిస్టులతో కలిసి ఈ హింసకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. విప్లవ రచయితల సంఘం (విరసం)కి హెడ్‌గా వరవరరావు ఉండటాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. ఐతే... తనపై వచ్చిన ఆరోపణలను వరవరరావు తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published: