Puri Jaganath Temple: పిల్లలను తీసుకుని గుడికెళుతున్నారా.. పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఏమైందంటే..

బారికేడ్స్ రైలింగ్స్ మధ్య చిన్నారి తల ఇరుక్కుపోయిన దృశ్యం

ఒడిశాలోని భవానీపట్న నగరానికి చెందిన ఓ కుటుంబం పిల్లలను తీసుకుని పూరీలోని జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లింది. పిల్లలతో కలిసి వెళ్లే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆ భార్యాభర్తలు ఆలయంలోకి వెళ్లి దర్శనం అనంతరం తిరిగొస్తున్న సందర్భంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ భార్యాభర్తల కూతురైన అంబికా రథ...

  • Share this:
    పూరీ: పూరీలోని జగన్నాథ స్వామి ఆలయానికి భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. జగన్నాథ రథయాత్రలో లక్షల మంది పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. స్వామి దర్శనానికి అలా వెళ్లిన ఓ కుటుంబం ఆ జగన్నాథుడి దయ వల్ల ఓ అపాయం నుంచి తప్పించుకుంది. చిన్న పిల్లలతో ఆలయాలకు, దర్శనీయ ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాళ్లను ఓ కంటకనిపెడుతూ ఉండాలి. పెద్దలు పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఒడిశాలోని భవానీపట్న నగరానికి చెందిన ఓ కుటుంబం పిల్లలను తీసుకుని పూరీలోని జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లింది. పిల్లలతో కలిసి వెళ్లే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆ భార్యాభర్తలు ఆలయంలోకి వెళ్లి దర్శనం అనంతరం తిరిగొస్తున్న సందర్భంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ భార్యాభర్తల కూతురైన అంబికా రథ అనే నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో పాటు వెళ్లకుండా వెనక వెనకే ఉంటూ.. ఆడుకుంటూ బారికేడ్ రైలింగ్స్ మధ్య తలపెట్టింది. దీంతో.. చిన్నారి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడున్న వారంతా చిన్నారి దగ్గరకు చేరుకుని ఆమె తలను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. అవేవీ ఫలించలేదు. చివరకు స్థానికుల్లో కొందరు శ్రీమందిర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులకు వెంటనే గ్యాస్ కట్టర్‌తో అక్కడికి చేరుకుని రైలింగ్స్‌ను కట్ చేశారు. దీంతో.. ఆ చిన్నారి తల బయటకు వచ్చింది. అపాయం తప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అపాయం నుంచి తప్పించుకున్న ఆ చిన్నారిని ముద్దాడారు. ఆ జగన్నాథుడి దయ వల్ల, స్థానికుల చొరవ వల్లే తమ కూతురికి కొత్త జీవితం దక్కిందని చిన్నారి తండ్రి రామ్‌నారాయణ్ చెప్పాడు.

    సమయానికి సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. పిల్లలతో ఆలయాలకు గానీ, బయటకు వెళ్లినప్పుడు గానీ తల్లిదండ్రులు వారిని వెంటబెట్టుకునే ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అపాయం తప్పదని పోలీసులు హెచ్చరించారు.
    Published by:Sambasiva Reddy
    First published: