ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ : నాలుగేళ్లకే ఈ బుడతడు బుక్ రాశాడు!

news18
Updated: June 6, 2018, 2:35 PM IST
ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ : నాలుగేళ్లకే ఈ బుడతడు బుక్ రాశాడు!
Image credits: india book of records
  • News18
  • Last Updated: June 6, 2018, 2:35 PM IST
  • Share this:నాలుగేళ్ళ  పిల్లాడు అద్భుతాన్ని క్రియేట్ చేశాడు .  తోటి పిల్లలు అఆ లు  ABCD లను నేర్చుకొంటుంటే  ఈ బాలుడు  మాత్రం ఏకంగా ఓ పుస్తకమే రాశాడు . నాలుగేళ్ల వయసుకే ఓ బుక్  రాసి ఇండియాలోనే అత్యంత చిన్నవయస్కుడైన రైటర్ గా  అరుదైన గుర్తింపు పొందాడు. 

వివరాల్లోకి  వెళితే... అసోంలోని ఉత్తర లఖింపూర్‌ జిల్లాకు చెందిన అయాన్‌ గగోయ్‌ గోహెయిన్‌ ఓ పుస్తకం రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఉత్తర లఖింపూర్‌లోని సెయింట్ మేరీస్‌ స్కూల్‌లో చదువుతున్న అయాన్ ‘హనీకాంబ్‌’పేరుతో రాసిన పుస్తకం ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది.

ఈ పుస్తకంలో 30 కథలతోపాటు తనకు తోచిన ఊహాజనిత విషయాలను, అందమైన బొమ్మలను గీశాడు. దీని ధర రూ.250 గా ఉంది . దేశవ్యాప్తంగా అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తుల జాబితాలో అయాన్‌ పేరును ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చేర్చింది.రోజూ  ఇంట్లో, మా ఊర్లో ఏం జరుగుతుందో అదే రాశాను. మా తాతయ్యతో ఏమి  మాట్లాడుతానో అదే రాశాను …’ అని అంటున్నాడు  ఈ బుల్లి  రచయిత. గోహెయిన్‌ ఏడాది వయసునుంటే పెయింటింగ్ మొదలుపెట్టాడు. మూడేళ్లొచ్చేసరికి బుల్లిబుల్లి కథలు అల్లడం నేర్చుకున్నాడు. నానమ్మ, తాతయ్యలతో కలిసి ఉండడం అయాన్‌కు కలిసొచ్చింది. అతని తల్లిదండ్రులు మిజోరాంలో ఉంటారు.

ఇక హనీకాంబ్‌ పుస్తకాన్ని తన అభిరుచులు, తాను చూసి దృశ్యాలు, తనకు నచ్చిన అంశాలతో అందంగా రాశాడు. అయాన్ గురించి ఆయన తాతా మాట్లాడుతూ.. తను ఓ అద్భుతం.. ఒకసారి ఇంద్రధనస్సు చూసి అందులో ఏడు రంగులనూ ఏడు స్వరాలతో పోలుస్తూ కవిత రాశాడని అన్నాడు. అంతేకాదు పుస్తకం కవర్ పేజ్‌ను కూడా అయాన్ రూపొందించాడని తెలిపాడు. అయాన్ పుస్తకంపై గొప్ప సాహిత్యవేత్తలు సమీక్షలు రాశారు. వారిలో రచయిత, కవి దిలీప్ మహాపాత్ర కూడా ఉన్నారు.

Published by: Sunil Kumar Jammula
First published: June 5, 2018, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading