Home /News /national /

FOUR PEOPLE TAKEN 26 YEARS OLD WOMAN TO THE JUNGLE AND TIED TO TREE STRIPPED FILMED AND SHAVED OFF HALF HER HAIR IN MUMBAI HSN

26 ఏళ్ల యువతిని పొలాల్లోకి తీసుకెళ్లి.. వివస్త్రను చేసి.. అరగుండు గీకి వీడియో రికార్డ్.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం (image credit - from youtube)

ప్రతీకాత్మక చిత్రం (image credit - from youtube)

నగ్నంగా నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆమె ఎలాగోలా రోడ్డుకు చేరింది. ఈ ఘటన జరిగిన షాక్ లో రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెను కొందరు వ్యక్తులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    ఓ 26 ఏళ్ల యువతికి మాయమాటలు చెప్పి నలుగురు వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కారు. చేతులు కాళ్లను కట్టేశారు. ఆమె వస్త్రాలను విప్పేశారు. ఓ చెట్టుకు ఆమెను కట్టేశారు. ఆమెను తీవ్ర దుర్భాషలాడారు. అంతే కాకుండా ఓ బ్లేడుతో ఆమెకు అరగుండు గీకారు. ఆ తర్వాత కట్లు విప్పేసి ఆమె దుస్తులతో సహా అక్కడి నుంచి పారిపోయారు. నగ్నంగా నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆమె ఎలాగోలా రోడ్డుకు చేరింది. ఈ ఘటన జరిగిన షాక్ లో రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెను కొందరు వ్యక్తులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. ఓ ముగ్గురు మగాళ్లతోపాటు ఓ మహిళ కూడా ఈ దారుణానికి తెగించిన వారిలో ఉందని తెలిసింది. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముంబై పరిధిలోని వాసైకి చెందిన 26 ఏళ్ల యువతిని ఫిబ్రవరి 19న సాయంత్రం పూట నలుగురు వ్యక్తులు కలిశారు. చెరకు రసం ఇప్పిస్తానంటూ ఆమెకు మాటలు చెప్పి భివాండీలోని పొలాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వారి మాటలు నమ్మి ఆ యువతి వెళ్లింది. అక్కడ ఓ చెట్టుకు ఆమెను కట్టేశారు. ఆమె వస్త్రాలను విప్పేశారు. పూర్తి నగ్నంగా ఆమెను మార్చేశారు. ఆమెకు సగం గుండును గీశారు. ఈ తతంగాన్నంతా ఫోన్లో వీడియోను తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. కాళ్లు చేతులకు కట్టిన తాళ్లను వదిలేసి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. రూ.40 లక్షలు అప్పుగా ఇస్తే.. తిరిగి ఇవ్వకపోవడంతో..

    ఆమె ఎలాగోలా ఆ అడవి నుంచి బయటపడింది. రోడ్డుకు చేరుకున్న తర్వాత పొదల్లో కిందపడిపోయింది. ఆమెను చూసిన కొందరు వ్యక్తులు తమ వద్ద ఉన్న వస్త్రాలను కప్పి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలిసి ఆస్పత్రికి చేరుకున్న పోలీసులకు ఆ యువతి వారిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అయితే బాధిత మహిళకు వీళ్లకు సంబంధం ఉందా? ఆమె వాళ్లతో కలిసి ఎందుకు వెళ్లింది? అసలు ఈ నిర్వాకానికి వాళ్లు ఎందుకు పాల్పడ్డారన్న విషయాలపై బాధిత యువతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఈ ఘటన వల్ల షాక్ లో ఉందనీ, కోలుకున్న తర్వాత ప్రశ్నించి విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.
    ఇది కూడా చదవండి: బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Illegal affairs, Mumbai crime, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు