Home /News /national /

FOUR PEOPLE FALL IN WATER WHILE TAKING SELFIES AT PAMBARU DAM IN TAMILNADU MS

విషాదం : సెల్ఫీ తీసుకుంటూ నలుగురు మృతి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మృతులను నివేదిత,కనిత, స్నేహిత, సంతోష్‌లుగా గుర్తించారు. మరో యువతి ఉవరణి కూడా డ్యామ్‌లో పడిపోయినప్పటికీ.. ప్రభు అనే యువకుడు ఆమెను కాపాడాడు.

    తమిళనాడులోని మరంపత్తి జిల్లా పంబరు డ్యామ్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడిపోయారు. అందులో ముగ్గురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు. మృతులను నివేదిత,కనిత, స్నేహిత, సంతోష్‌లుగా గుర్తించారు. మరో యువతి ఉవరణి కూడా డ్యామ్‌లో పడిపోయినప్పటికీ.. ప్రభు అనే యువకుడు ఆమెను కాపాడాడు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతయినవారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.మృతదేహాలను వెలికితీశాక పోస్టుమార్టమ్‌కి పంపించారు.మృతులంతా దగ్గరి బంధువులేనని.. సరదాగా గడుపుదామని వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు అంటున్నారు.
    First published:

    Tags: Selfie, Selfie Deaths, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు