హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Maoists attack: మావోయిస్టుల మెరుపుదాడి.. భద్రతా బలగాలపైకి గ్రెనేడ్లు.. 4జవాన్లకు గాయాలు..

Maoists attack: మావోయిస్టుల మెరుపుదాడి.. భద్రతా బలగాలపైకి గ్రెనేడ్లు.. 4జవాన్లకు గాయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. గ్రెనేడ్లు, తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. వివరాలివే..

కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. సాధారణంగా ఎండాకాలంలో కూంబింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో దానిని నిలువరించేందుకే మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం..

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా  వద్ద భద్రతా బలగాల క్యాంపుపై శనివారం రాత్రి 11 గంటల సమయంలో మావోయిస్టులు దాడి జరిపారు. అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు (బిజిఎల్)తో మావోయిస్టులు క్యాంపును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తుపాకులతోనూ కాల్పులు జరిపారు.

Affair: మరిదితో అక్రమ సంబంధం.. దాన్ని కప్పిపుచ్చేందుకు చెల్లిని ఇచ్చి వివాహం.. చివరికి షాకింగ్ ట్విస్ట్


మెరుపుదాడి నుంచి తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాగా, దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హెలికాప్టర్ల ద్వారా రాయ్ పూర్ సిటీలోని ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతున్నది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

First published:

Tags: Chhattisgarh, Maoist, Maoist attack