హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bhopal: చిన్న పిల్లల ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

Bhopal: చిన్న పిల్లల ఐసీయూ వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారుల మృతి

గాయపడిన వారికి చికిత్సనందిస్తున్న దృశ్యం

గాయపడిన వారికి చికిత్సనందిస్తున్న దృశ్యం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో ఉన్న కమల నెహ్రు ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో(PICU) సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఆ సమయంలో పీఐసీయూలో 50 మందికి పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో ఉన్న కమల నెహ్రు ఆసుపత్రిలోని పిల్లల ఐసీయూ వార్డులో(PICU) సోమవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఆ సమయంలో పీఐసీయూలో 50 మందికి పైగా చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.

  భయంతో పిల్లలను తీసుకుని పరుగులు తీశారు. దురదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్లు భావిస్తున్నారు. పీఐసీయూ మూడో ఫ్లోర్‌లో ఉండటంతో కిందకు రావడానికి కొంత సమయం పట్టింది. ఈలోపే మంటలు అంటుకోవడం, దట్టంగా పొగలు వ్యాపించడంతో నలుగురు పసి పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

  ఇది కూడా చదవండి: Afghans Sell Children: ఆప్ఘనిస్తాన్‌లో దయనీయ పరిస్థితి.. కన్న కూతుర్లను అమ్ముకుంటున్న దుస్థితి..

  కొందరు తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కిందకు దూకడంతో గాయపడ్డారు. మంటలు రేగిన విషయం తెలిసి 10 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ నిజానిజాలను నిగ్గుతేల్చాలని సీఎం ఆదేశించారు. మధ్యప్రదేశ్ వైద్య శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో 36 మంది ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని మంత్రి చెప్పారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ చిన్నారుల బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

  ఇది కూడా చదవండి: US: 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచిన అమెరికా -విదేశీ ప్రయాణాలకు అనుమతి -భారతీయులకు ఊరట

  హాహాకారాలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. మంత్రి బాధిత కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. సోమవారం రాత్రి 8.40కి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో ఒకరు ఘటన గురించి కంట్రోల్ రూంకు సమాచారం అందించినట్లు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తీగలు కాలిపోవడం, ఆ పొగలు దట్టంగా వ్యాపించడంతో ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. పీఐసీయూలో ఉన్న చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది, నర్సులు మరో వార్డుకు తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగనుంది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bhopal, Children, Fire broke out, Hospitals, Shivraj Singh Chouhan

  ఉత్తమ కథలు