ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా.. ఇద్దరు ఏపీ జవాన్లు సహా నలుగురు మృతి

మృతుల్లో ఇద్దరు ఆంధ్రా సీహెచ్ ప్రవీణ్ (21), శ్రీను కుమార్ (26) జవాన్లు ఉన్నారు. వీరితో పాటు ఒడిశాకు చెందిన బెహ్రా (43), బెంగాల్‌కు చెందిన రెహ్మాన్ (50) అమరులయ్యారు. ః

news18-telugu
Updated: October 28, 2018, 8:35 AM IST
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టుల పంజా.. ఇద్దరు ఏపీ జవాన్లు సహా నలుగురు మృతి
గాయపడ్డ జవాన్, ఎన్ కౌంటర్ ఘటనా స్థలం
  • Share this:
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. మ‌రో 15 ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న తరుణంలో భ‌ద్ర‌తా ద‌ళాలే టార్గెట్‌గా విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వెళ్తున్న వాహ‌నాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం మ‌రిన్ని బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వ‌హిస్తున్నాయి.

మావోల కాల్పుల్లో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు


మృతుల్లో ఇద్దరు ఆంధ్రా సీహెచ్ ప్రవీణ్ (21), శ్రీను కుమార్ (26) జవాన్లు ఉన్నారు. వీరితో పాటు ఒడిశాకు చెందిన బెహ్రా (43), బెంగాల్‌కు చెందిన రెహ్మాన్ (50) అమరులయ్యారు. ఇక మహారాష్ట్రకు చెందిన బాబురావ్ సిద్దేశ్వర్, గుజరాత్‌కు చెందిన హార్దిక్ సురేశ్ కుమార్‌కు గాయాలయ్యాయి.


మావోల కాల్పుల్లో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు
కాగా, న‌వంబ‌రులో ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు విడ‌త‌ల్లో పోలింగ్ నిర్వ‌హిస్తారు. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో న‌వంబ‌రు 12న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన ప్రాంతాల్లో నవంబ‌రు 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, రాజ‌స్థాన్‌తో పాటు డిసెంబ‌రు 11న ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.
First published: October 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>