ఒక్క పాముతో 4 పిల్లుల ఫైటింగ్... గెలిచిందెవరంటే...

Viral Video : పాము, ముంగిస దెబ్బలాడుకుంటే... కచ్చితంగా ముంగీసే గెలుస్తుంది. కానీ... పాము, పిల్లులు దెబ్బలాడుకుంటే గెలిచేదెవరు? అసలు పిల్లులు, పాముల జోలికి వెళ్తాయా? ఈ ఘటనలో ఏం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 1:59 PM IST
ఒక్క పాముతో 4 పిల్లుల ఫైటింగ్... గెలిచిందెవరంటే...
ఒక్క పాముతో 4 పిల్లుల ఫైటింగ్... గెలిచిందెవరంటే... (Source - Insta - neilnitinmukesh)
  • Share this:
నటుడు నీల్ నితిన్ ముఖేష్... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. అందులో ఓ పామును అడ్డగించిన నాలుగు పిల్లులు చుట్టూ ఆక్రమించాయి. పాము ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేశాయి. అది మామూలు స్నేక్ కాదు. నల్లతాచు. (Cobra). దాని ఒక్క చుక్క విషంతో... 20 మందిని చనిపోగలరు. అదెలా అంటే... దాని ఒక్క చుక్క విషాన్ని నీటిలో కలిపి... ఆ నీటిని 20 మందికి ఇస్తే... అందరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంత పవర్‌ఫుల్ విషం నల్లతాచుకు ఉంటుంది. అలాంటి తాచు... వచ్చే సరికి ఏం చెయ్యాలో తెలియక... జనం కంగారుపడుతుంటే... దాన్ని అడ్డుకునేందుకు పిల్లులు ట్రై చేశాయి. తన కొత్త సినిమా బైపాస్ రోడ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించిందని నీల్ నితిన్ ముఖేష్ తెలిపాడు.
 View this post on Instagram
 

Earlier in the day. Went for the BGM with @naman.n.mukesh for #BypassRoad , got down of the car and saw this.


A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

ఈ వీడియోలో నాలుగు పిల్లులు ఉండేసరికి... తాచు పాముకి తాను గెలవలేనని అర్థమైపోయింది. అయినప్పటికీ... పడగ ఎత్తి... ఒక్కో పిల్లినీ బెదిరిస్తూ... మెల్లమెల్లగా మొక్కలున్న వైపు పాకుతూ వెళ్లింది. పిల్లులు కూడా... తాచు పాము ఎక్కడ కాటు వేస్తుందో అన్న సంశయంతో... దాని పైకి వెళ్లకుండా... అలా చూస్తూ... ఉన్నాయి. అదే సమయంలో... నీల్ నితిన్‌తోపాటూ... కొంతమంది ఈ వీడియో తీశారు. మొత్తానికి పాము మొక్కల్లోకి వెళ్లిపోవడంతో... పిల్లులు కూడా రూట్ మార్చి... వేరేవైపు వెళ్లిపోయాయి. కాసేపటి తర్వాత అటవీశాఖ అధికారులు వచ్చి, ఆ పామును తీసుకుపోయారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading