Home /News /national /

Oscar Fernandes: కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

Oscar Fernandes: కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆస్కార్ ఫెర్నాండెజ్ అత్యంత ఆప్తుడు కూడా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆస్కార్ ఫెర్నాండెజ్ అత్యంత ఆప్తుడు కూడా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆస్కార్ ఫెర్నాండెజ్ అత్యంత ఆప్తుడు కూడా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.

  కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (Oscar Fernandes) కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆస్కార్ ఫెర్నాండెజ్ గత జూలై నుంచి కర్ణాటకలోని (Karnataka) మంగళూరులో ఉన్న ఎనెపోయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డయాలసిస్ చికిత్స చేస్తుండగా ఓసారి బాగా తలనొప్పి రావడంతో ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయనకు శరీర అంతర్గత అవయవాల్లో గాయాలు ఉన్నట్టు గుర్తించారు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఇలా జరిగింది. దానికి ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా ఆయన కన్నుమూశారు.

  ఆస్కార్ ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న బోర్డ్ హైస్కూల్లో ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ప్రఖ్యాతిపొందిన హెడ్ మాస్టర్. ఆయన తల్లి లియోనిసా ఫెర్నాండెజ్. ఉమ్మడి దక్షిణ కనర జిల్లాకు ఆమె మొట్టమొదటి బెంచ్ మెజిస్ట్రేట్. సెయింట్ సీసిలీస్ కాన్వెంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఆస్కార్ ఆ తర్వాత ఎంజీఎం కాలేజీలో చదువుకున్నారు.

  కొంతకాలం ఎల్ఐసీలో పనిచేసిన అస్కార్ ఆ తర్వాత మణిపాల్‌లో వ్యాపారం చేశారు. కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. ఉత్తమ వరి ఉత్పత్తిదారుడి అవార్డు కూడా అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆస్కార్ ఆ తర్వాత రాజకీయాల వైపు మళ్లారు. ‘జాలీ క్లబ్‌’ను స్థాపించి యువతలో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు.

  ఉడుపి ఆటో రిక్షా యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉడుపి చర్చి పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉడుపిలో కులం, మతం అనే తేడాలేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.

  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఆస్కార్ ఫెర్నాండెజ్ అత్యంత ఆప్తుడు కూడా. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ ఎలక్షన్ అధారిటీ చైర్మన్‌గా సేవలు అందించారు. రాజీవ్ గాంధీకి పార్లమెంట్ సెక్రటరీగా కూడా ఉన్నారు.

  1972 నుంచి 76 వరకు ఉడుపి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేశారు. 1996లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1980ల్లో కర్ణాటక పీసీసీ చీఫ్ గా సేవలు అందించారు. 1989 నుంచి 1999 వరకు కర్ణాటక పీసీసీ సభ్యుడిగా కొనసాగారు. 1980లో తొలిసారి ఏడో లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉడుపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1984, 1989, 1991, 1996లో వరుసగా ఉడుపి నుంచి విజయం సాధించారు.

  1998లో తొలిసారి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పెద్దల సభకు పంపింది. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. విదేశాంగ వ్యవహారాలు, యూత్ అండ్ స్పోర్ట్స్, గణాంకాలు వాటి అమలు ప్రోగ్రాం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖలు చూశారు.

  రాజకీయనాయకుడిగానే కాకుండా ఆయన మానసికోల్లాసం విషయంలో ఉత్సాహంగా ఉండేవారు. కబడ్డీ, వాలీబాల్, స్విమింగ్ చేసేశారు. యక్షగానం కూడా చేసేవారు. యోగా కూడా ప్రాక్టీస్ చేశారు. కూచిపూడి కూడా నేర్చుకున్నారు. చిన్నప్పుడు మౌత్ ఆర్గాన్ ప్లే చేసేవారు. హార్మోనియం, కీ బోర్డు, తబలా వాయించేవారు. సొంతంగా పద్యాలు రచించారు. అవకాశం వచ్చినప్పుడల్లా చర్చిలో పాటలు కూడా పాడేవారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Congress, Karnataka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు