తమిళనాడు మాజీ సీఎం (Tamilnadu Former CM) ఎడప్పాడి పళనిస్వామి (Palani swamy) మాజీ సహాయకుడిని (helper) సేలం జిల్లా క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఎడప్పాడి పళనిస్వామి తమిళనాడు సీఎంగా పనిచేసినప్పుడు.. సేలం సమీపం ఓమలూరు నడుపట్టికి చెందిన మణి (Mani)అనే వ్యక్తి ఆయన వద్ద సహాయకుడి (helper)గా పని చేశారు. అయితే ఇదే అదునుగా భావించిన మణి తన పలుకుబడితో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పథకం రచించాడు. నిరుద్యోగ యువకుల వద్ద లక్షలు కాజేశాడు. కాగా, ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని అభ్యర్థులు భావించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడులోని కడలూరు జిల్లా నైవేలికి చెందిన తమిళ సెల్వన్ (Tamil selvan) అనే నిరుద్యోగికి రవాణా శాఖలో అసిస్టెంట్ ఇంజనీ (Assistant Engineer)గా ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.17 లక్షలు వసూలు చేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోగా.. తాను ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో తమిళ సెల్వన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తే తీవ్ర పరిణామాలుంటాయని మణి బెదిరించినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదు (In complaint)లో రాశాడు. తమిళసెల్వన్ ఫిర్యాదు మేరకు పోలీసులు (Police) మణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మణి, తమిళసెల్వన్కు మధ్య బ్రోకర్ (Broker)గా వ్యవహరించిన సెల్వకుమార్ (selva kumar) అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రభుత్వ ఉద్యోగం పేరిట మణి చేతిలో మోసపోయిన మరికొందరు నిరుద్యోగ యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అమాయక యువకుల నుంచి మణి దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు
ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ (bail) పిటిషన్లపై సేలం కోర్టు, మద్రాస్ హైకోర్టులు నిరాకరించాయి. పరారీలో ఉన్న మణి ఆచూకీని గుర్తించిన సేలం క్రైం విభాగం పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు.
గత వారమే కేంద్ర మంత్రి సహాయకుడు..
కాగా, గత వారమే ఇలాంటి కేసు ఒకటి తమిళనాడులో నమోదైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ( Tamilnadu Assembly elections) ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం (cheat) చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆ వ్యక్తి సాక్ష్యాత్తు ఓ కేంద్ర మంత్రి (Union minister) మాజీ సహాయకుడు కావడం గమనార్హం. ఆ వ్యక్తి పేరు నరోత్తమన్ (narothaman). ఇదే కేసులో అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్టు (arrest) చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి జయలక్ష్మినగర్కు చెందిన బీజేపీ నేత భువనేష్ కుమార్ (Bhuvanesh kumar) (29) చెన్నై పాండిబజార్ పోలీస్స్టేషన్లో ఈ ఏడాది జూలైలో ఓ ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Palanisami, Tamil nadu