మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి (AIIMS Hospitals) నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు. ఈనెల 13న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీ (Delhi)లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ తర్వాత డెంగీ నిర్ధారణ అయినట్లు వైద్యులు (doctors) ధ్రువీకరించారు. అప్పటి నుంచి మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స (treatment) పొందుతున్నారు. ఇక తాజాగా ఆదివారం రాత్రి ఎయిమ్స్ వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి (discharge) చేశారు. కాగా, ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ప్రైవేట్ వార్డులో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందించారు. మన్మోహన్ ఆస్పత్రి డిశ్చార్జ్ కావడంతో ఆయన కుటుంబంతో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది నెలల క్రితం కూడా..
88 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొద్ది నెలల క్రితం కూడా అనారోగ్యానికి (Unhealthy) గురయ్యారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన కూడా కరోనా (Covid 19) బారిన పడ్డారు . ఆ సమయంలో నెల రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మన్మోహన్ డిశ్చార్జ్ అయ్యారు.
2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ (UPA) కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా (Prime minister) బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా (successfully) నడిపించారు. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధాని (PM) గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో యూపీఏ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనకు ఒకసారి బైపాస్ సర్జరీ (surgery) కూడా జరిగింది. కొన్ని నెలల విశ్రాంతి తీసుకున్న అనంతరం.. ఆయన తిరిగి విధుల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎంతో విధేయుడిగా ఉన్నారు మన్మోహన్. అయితే వయోభారం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
Former PM Dr Manmohan Singh, who was admitted to AIIMS, Delhi earlier this month, has been discharged after treatment
(File photo) pic.twitter.com/9wM1wRSWf7
— ANI (@ANI) October 31, 2021
మన్మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన తర్వాతి రోజు రాహుల్ గాంధీ హాస్పిటల్ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Hospitals, Manmohan singh