హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Manmohan Singh Family: కేంద్ర మంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యంతరం.. ఇలాగేనా చేసేది అంటూ..

Manmohan Singh Family: కేంద్ర మంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యంతరం.. ఇలాగేనా చేసేది అంటూ..

మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫోటో)

మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫోటో)

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (former Prime Minister Manmohan Singh) బుధవారం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (former Prime Minister Manmohan Singh) బుధవారం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మన్మోహన్ సింగ్‌ను ఆస్పత్రికికి వెళ్లి పరామర్శిస్తున్నారు. అయితే మన్మోహన్ సింగ్‌ను రామర్శించడానికి వచ్చిన సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Union Health Minister Mansukh Mandaviya) వ్యవహరించిన తీరుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. గురువారం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా.. మన్మోహన్ సింగ్ పరామర్శించడానికి వచ్చిన సమయంలో ఆయనతో పాటు ఫొటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శిస్తున్న సమయంలో ఫొటో దిగారు. అయితే దీనిని తప్పుపడుతున్నట్టుగా మన్మోహన్ సింగ్ కుటంబం (Manmohan Singh Family) పేర్కొంది. ఈ మేరకు మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. తన తండ్రి చికిత్స పొందుతున్న గదికి వచ్చిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తనతో ఫొటోగ్రాఫర్‌ను వెంట తీసుకురావడంపై తన తల్లి అభ్యంతరం వ్యక్తం చేసిందని డామన్ సింగ్ తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదని చెప్పారు.

  ‘మా నాన్న ఎయిమ్స్‌లో ( All India Institute of Medical Sciences) డెంగ్యూతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఆయన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. ఇన్ఫెక్షన్ రిస్క్ కారణంగా మేము సందర్శకులను ఎక్కువగా అనుమతించడం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి మా నాన్నను పరామర్శించడం చాలా ఆనందమే. అయితే, ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఫోటో తీయడం కరెక్ట్ కాదు. కేంద్ర మంత్రి తనతో పాటు ఫొటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకెళ్లారు. దానిపై నా తల్లి అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఆమె చాలా కలత చెందింది. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు వృద్ధులు.. జంతుప్రదర్శనశాలలో జంతువులు కాదు’అని డామన్ సింగ్ (Daman Singh) అన్నారు.

  Viral Video: చెంబులో మూగజీవి తల.. సాయం చేయడానికి వెళ్లిన షర్మిల పార్టీ నేత.. అసలు విషయం తెలిసి పరుగో పరుగు..


  మన్మోహన్ సింగ్‌ను పరామర్శిస్తున్న సమయంలో తీసిన ఫొటోలను మన్సుఖ్ మాండవియా గురువారం ట్వీట్ చేశారు. అయితే నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వాటిని డిలీట్ చేశారు. ఇక, ఇందుకు సంబంధించి పలువురు కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు కూడా మన్సుఖ్ మాండవియా, బీజేపీలపై మండిపడింది. బీజేపీ ప్రతీ విషయంలో ఫొటో అవకాశాల కోసమే చూస్తుందని విమర్శించారు. ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం ఆపాలని కోరింది.

  ఇక, జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ సహా, పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌తో మాట్లాడారు. అలాగే వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకన్నారు. దాదాపు అర్ధగంట పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు.

  మన్మోహన్ సింగ్ ఆరోగ్యం (Manmohan Singh Health) నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన ఆరోగ్యం నిన్నటికంటే మెరుగుపడిందని కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ప్రణవ్ ఝా ట్వీట్ చేశారు. ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుందామని.. ఆయన గోప్యతను గౌరవిద్దాం అని పేర్కొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Aiims, Manmohan singh

  ఉత్తమ కథలు