Pranab Mukherjee: కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. క్షీణించిన ఆరోగ్యం

Pranab Mukherjee: హిమోడైనమికల్లీ స్టేబుల్ అంటే పేషెంట్ బతికే ఉంటారు కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్‌గా ఉంటుంది. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇలానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

news18-telugu
Updated: August 14, 2020, 6:15 AM IST
Pranab Mukherjee: కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ.. క్షీణించిన ఆరోగ్యం
ప్రణబ్ ముఖర్జీ(ఫైల్ ఫోటో)
  • Share this:
Pranab Mukherjee: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరెల్‌ ఆసుపత్రి గురువారం తెలిపింది. ఐతే అవయవాలు మాత్రం పనిచేస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు. ప్రణబ్ ఆరోగ్యం హిమోడైనమికల్లీ స్టేబుల్ అని తెలిపారు. హిమోడైనమికల్లీ స్టేబుల్ అంటే అసాధారణ గుండె రేటు, ఛాతీ నొప్పి, చేతులు, కాళ్లు చల్లబడటం, మూత్రం తగ్గడం, లోబీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. పేషెంట్ బతికే ఉంటారు కానీ ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్‌గా ఉంటుంది. ప్రస్తుతం ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇలానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రణబ్ ముఖర్జీ ఐదు రోజులుగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఐతే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కుమారుడు అభిజిత్ ముఖర్జీ, కూతురు షర్మిష్ట ముఖర్జీ ఖండించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సోమవారం ట్విటర్ వేదికగా ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే.. కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను గత వారం రోజులుగా కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలంటూ అన్ని పార్టీల నేతలు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు
Published by: Shiva Kumar Addula
First published: August 14, 2020, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading