FORMER PRESIDENT APJ ABDUL KALAMS BROTHER MOHAMMED MUTHU MEERA PASSES AWAY SK
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోదరుడు కన్నుమూత.. మహమ్మద్ ముత్తుమీరా ఇక లేరు
అబ్దుల్ కలాం, మహమ్మద్ మత్తుమీరా (ఫైల్ ఫొటో)
మహమ్మద్ ముత్తుమీరా మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీరా లెబ్బయ్ మరాయ్కయార్ కన్నుమూశారు. 104 ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 07.30 గంటల సమయంలో రామేశ్వరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కలాం పెద్దన్నయ్య మరణించడంతో రామేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మహమ్మద్ ముత్తుమీరా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే ఉంచారు.
Former President Dr APJ Abdul Kalam's elder brother Mohammed Muthu Meera Lebbai Maraikayar passes away at his residence in Rameshwaram at the age of 104
ఏపీజే అబ్దుల్ కలా ఇంటర్నేషన్ ఫౌండేషన్ ట్రస్టీలో మహమ్మద్ ముత్తుమీరా కూడా ఒకరు. మహమ్మద్ ముత్తుమీరా మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Condolences for Thiru Mohd Muthu Meera Maraikayar brother of #APJ Kalam. భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలామ్ గారి అన్న మహ్మద్ ముతు మీర మరైకర్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి.వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ஏவுகனைநாயகன் சகோதரர் முஹமதுமுத்து மீரான் ஆத்மா சாந்தி அடைய வேண்டுகிறேன் pic.twitter.com/pyYKVhUIS6
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 7, 2021
కాగా, ఏపీజే అబ్దుల్ కలాం 2015 జులై 27న మేఘాలయాలోని షిల్లాంగ్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన మరణించారు. అబ్దుల్ కలాం 2002, జులై 25 నుంచి 2007, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.