హోమ్ /వార్తలు /జాతీయం /

OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి

OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి

OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి

OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి

రిటైర్ అయ్యే సమయంలో 50 ఏళ్ల పాటు తీసుకోని సెలవుల్ని నిబంధనల ప్రకారం ఎన్‌క్యాష్ చేసుకున్నారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే లాభాలతో పాటు... సెలవులు ఎన్‌క్యాష్ చేసుకున్నందుకు అదనంగా రూ.19 కోట్లు వచ్చాయి.

  మిగిలిపోయిన సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకోవడం ఉద్యోగులకు అలవాటు. అలా మిగిలిపోయిన లీవ్స్‌ని ఎన్‌క్యాష్ చేసుకుంటే ఎంత వస్తుంది? మహా అయితే ఒకట్రెండు నెలల జీతం అదనంగా రావొచ్చు. కానీ ఓ వ్యక్తి రిటైర్ అయ్యే సమయంలో మిగిలిపోయిన సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకుంటే ఎంత వచ్చిందో తెలుసా? రూ.19 కోట్లు. అవును... అక్షరాలా 19 కోట్ల రూపాయలు. నమ్మాలని లేదా? నమ్మి తీరాల్సిందే.


  Read this: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...


  సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకొని రూ.19 కోట్లు అదనంగా తన అకౌంట్‌లో వేసుకున్న వ్యక్తి పేరు అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్. ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఎల్ అండ్ టీలో నాన్-ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూడలేదు. తన ప్యాషన్ ఏంటో చూపించారు. నిబద్ధత, అంకితభావంతో పనిచేశారు. ఆయన రోజూ ఆఫీసుకి వెళ్లేవారు. ఏ కారణంతోనూ సెలవులు తీసుకోలేదు. ఇలా ఒకట్రెండేళ్లు కాదు... వరుసగా 50 ఏళ్లు సెలవులు తీసుకోకుండా పనిచేశారు. 2018లో ఆయన రిటైర్ అయ్యే సమయంలో 50 ఏళ్ల పాటు తీసుకోని సెలవుల్ని నిబంధనల ప్రకారం ఎన్‌క్యాష్ చేసుకున్నారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే లాభాలతో పాటు... సెలవులు ఎన్‌క్యాష్ చేసుకున్నందుకు అదనంగా రూ.19 కోట్లు వచ్చాయి.


  Read this: మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే


  ఇలా తను ఎంచుకున్న రంగంలో విశేష సేవలు అందించిన అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్‌కు భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. అనిల్ కుమార్ 1965 లో ఎల్ అండ్ టీలో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కార్పొరేట్ లీడర్‌గా ఎదిగారు. 1986లో జనరల్ మేనేజర్ అయ్యారు. 2003 నాటికి ఎల్ అండ్ టీ ఛైర్మన్‌ పదవిని అలంకరించారు.


  Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...  ఇవి కూడా చదవండి:


  జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?


  IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...


  Redmi Go: షావోమీ నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్

  First published:

  Tags: OMG, Padma Awards

  ఉత్తమ కథలు