టీచ‌ర్స్ డే రోజున‌ క‌న్నుమూసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు

కేశవ్ దేశిరాజు (ఫొటో క్రెడిట్ ట్విట్టర్)

స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ మ‌నువ‌డు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు (66) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో(Private Hospital) లోకాన్ని వీడారు. ఆయ‌న కొంత కాలంగా కరోన‌రీ సిండ్రోత్‌తో బాధ‌ప‌డుతూ సెప్టెంబర్ 5న తుది శ్వాస విడిచారు.

 • Share this:
  దేశమంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే(Teachers Day) వేడుకలు ఘనంగా నిర్వ‌హించుకొన్నారు. రాష్ట్ర‌ప‌తి ఈ ఉపాధ్యాయ దినోత్స‌వం రోజున దేశ‌వ్యాప్తంగా 44 ఉపాధ్యాయుల‌కు వారి సేవ‌ల‌కు గుర్తింపుగా అవార్డులు అందించారు. ఈ సంతోష‌క‌ర స‌మ‌యంలో స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న మ‌నువ‌డు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు (66) అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లోకాన్ని వీడారు. ఆయ‌న కొంత కాలంగా కరోన‌రీ సిండ్రోత్‌తో బాధ‌ప‌డుతున్నారు. ప‌రిస్థితి విష‌మించి ఆయ‌న సెప్టెంబ‌ర్ 5 న క‌న్నుమూసిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు.
  ఐఏఎస్‌గా దేశ‌సేవ‌..
  ఎకనమిక్స్ లో కేంబ్రిడ్జి(Cambridge) నుంచి మాస్టర్ట్స్ చేసిన కేశవ్ రాజు.. తర్వాత హార్వర్డ్ జాన్ ఎఫ్ కెన్నెడీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఏ చేశారు . అంత‌రం కేశవ్ దేశిరాజు 978 బ్యాచ్ ఉత్తరాఖండ్(Uttarakhand) క్యాడర్ ఐఎఎస్ అధికారిగా ప‌ని చేశారు.

  NEET 2021 Admit Cards: వారం రోజుల్లో నీట్ అడ్మిట్ కార్డులు.. హాల్ టికెట్‌లో ఏం చెక్ చేయాలో తెలుసుకోండి
  అనంత‌రం ఆయ‌న రిటైర్ అయ్యాక కేంద్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ప‌నిచేసి దేశానికి సేవ‌చేశారు. ఇవే కాకుండా ఆయన పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (Population Foundation of India) పాల‌క మండ‌లికి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ఉన్న‌తాధికారులు సంతాపం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను గుర్తుచేసుకొన్నారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నపుడు ఆయన పలు కార్యక్రమాలను విజయవంతంగా రూపొందించి అమలు చేసిన‌ట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు.
  మంచి ర‌చ‌యిత కూడా..
  ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ తర్వాత కేశవ్ 2016లో వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ బిల్ వెనక కేశవ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పలు పుస్తకాలకు రచించారు. లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితంపై “గిఫ్టెడ్ వాయిస్: ద లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి” అనే పుస్తకం రాశారు. భారత వైద్య రంగంలో ఉన్న అవినీతి గురించి సమిటన్ నండీ, సంజయ్ నాగ్రాల్‌లతో కలిసి 2018లో "హీలర్స్ ఆర్ ప్రీడేటర్స్? హెల్త్ కేర్ కరప్షన్ ఇన్ ఇండియా" పుస్తకాన్ని కేశవ్ రాశారు.
  Published by:Sharath Chandra
  First published: