Home /News /national /

FORMER HARYANA CONGRESS CHIEF ASHOK TANWAR JOINS AAP IN PRESENCE OF KEJRIWAL PVN

Ashok Tanwar : దేశ రాజకీయాలపై కేజ్రీవాల్ ఫోకస్..ఆప్ లో చేరిన హర్యానా కీలక నేత

ఆప్ లో చేరిన అశోక్ తన్వర్

ఆప్ లో చేరిన అశోక్ తన్వర్

AAP In Haryana : మరికొన్ని నెలల్లో జ‌ర‌గ‌బోయే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ అహ్మాదాబాద్ ను సంద‌ర్శించారు. ముందుగా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి వెళ్లారు. అనంత‌రం ర్యాలీ నిర్వ‌హించారు. త‌మ పార్టీకి ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు.

ఇంకా చదవండి ...
AAP In Haryana :  ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిధిని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్ పై ముందుగా ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో ఆప్ నేతలు పర్యటిస్తూ ప్రజల, ఇతర పార్టీల నాయకుల దృష్టి పడేలా చూసుకుంటున్నారు. పలువురు నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తోంది ఆప్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం అనంత‌రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరిక‌లు ఊపందుకున్నాయి. తాజాగా హ‌ర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ త‌న్వ‌ర్ ఆప్‌లో చేరారు. గత‌ ఏడాది న‌వంబ‌ర్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌ లో చేరిన త‌న్వ‌ర్ ఆ పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఆప్ అశోక్ త‌న్వ‌ర్ సోమ‌వారం ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరారు.

2024లో హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భావిస్తున్న ఆప్‌ త‌న్వ‌ర్ చేరికతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. త‌న్వ‌ర్‌ను ఆప్‌లోకి స్వాగ‌తించిన కేజ్రీవాల్ ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వం హ‌ర్యానాతో పాటు దేశ‌వ్యాప్తంగా ఆప్ విస్త‌ర‌ణ‌కు బాట‌లు వేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అశోక్‌ జీని ఆప్ కుటుంబంలోకి స్వాగ‌తిస్తున్నాన‌ని, విద్యార్ధి రాజ‌కీయాల నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కూ కొనసాగిన ఆయన రాజ‌కీయ అనుభ‌వం ఆప్‌ కు హ‌ర్యానాతో పాటు జాతీయ రాజ‌కీయాల్లో ఎదుగుద‌ల‌కు ఉప‌క‌రిస్తుంద‌ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ALSO READ Afganistan : తాలిబన్ మరో కీలక నిర్ణయం..అప్ఘాన్ లో ఇకపై ఆ పంట పండించకూడదట

గతంలో హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుండి ఎంపీగా పనిచేసిన తన్వర్.. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ (INYC) ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితుడిగా ఉండేవాడు. అశోక్ త‌న్వ‌ర్ INYC,నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడిన తన్వర్..2021 ఫిబ్ర‌వ‌రి నెల‌లో ‘అప్నా భారత్ మోర్చా’ అనే కొత్త రాజకీయ పార్టీని కూడా ప్రారంభించాడు. అయితే గ‌తేడాది నవంబర్ 23వ తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధాని ఢిల్లీలో సందర్శించినప్పుడు తన్వర్ తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ దుష్పరిపాలనతో దేశం మొత్తం విసిగిపోయింది. ఈ శక్తులను ఓడించగలిగే వ్యక్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది మ‌మ‌తా బెన‌ర్జీ మాత్ర‌మే అని నేను భావిస్తున్నాను.. టీఎంసీ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. పార్టీ కొత్త సంకల్పంతో ముందుకు సాగుతోంది అని తన్వర్ ఆ స‌మ‌యంలో చెప్పారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో TMC పేలవమైన ప్రదర్శన వెనుక కారణాలను పరిశీలించడానికి తన్వర్‌ను ఇటీవల ఒక కమిటీకి అధిపతిగా కూడా నియమించారు.

ఇదిలావుండగా, మరికొన్ని నెలల్లో జ‌ర‌గ‌బోయే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ అహ్మాదాబాద్ ను సంద‌ర్శించారు. ముందుగా స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి వెళ్లారు. అనంత‌రం ర్యాలీ నిర్వ‌హించారు. త‌మ పార్టీకి ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు. ఢిల్లీ, పంజాబ్ ప్ర‌జ‌లు ఇచ్చినట్టుగా ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్యర్థించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, Aravind Kejriwal, Haryana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు