Keshubhai Patel: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

news18-telugu
Updated: October 29, 2020, 3:14 PM IST
Keshubhai Patel: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత
కేశుభాయ్ పటేల్(Keshubhai Patel)
  • Share this:
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. గతంలో కేశుభాయ్ పటేకు బైపాస్ సర్జరీ జరిగింది.  ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయనకు గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. 10 రోజుల తర్వాత కరోనా నెగిటివ్‌గా తేలడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో
గురువారం ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుద్విశాస విడిచారు.

గుజరాత్‌లోని విసావదర్ పట్ణణంలో కేశుభాయ్ పటేల్ 1928లో ఆయన జన్మించారు. 1945 ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా చేరారు. 1960లో జనసంఘ్‌ ద్వారా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995 మర్చి నుంచి అక్టోబర్ వరకు, 1998 మార్చి నుంచి 2001 అక్టోబర్‌ వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొత్తంగా ఆరుసార్లు గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీకి రాజీనామా చేసే వరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగారు. ఆ తర్వాత గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కేశుభాయ్ పటేల్ పార్టీ అనుకున్న మేర ఫలితాలు సాధించలేకపోయింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం ఫిబ్రవరి 2014లో ఆ పార్టీ బీజేపీలో విలీనం అయింది.

ఇక, 2012లో విసావదర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కేశుభాయ్ పటేల్.. అనారోగ్య కారణాల రీత్యా ఎమ్మెల్యే పదవికి 2014లో రాజీనామా చేశారు. ఇక, అప్పటి నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు కొద్దిగా దూరంగా ఉంటున్నారు.


కేశుభాయ్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
కేశుభాయ్ పటేల్ మృతిపై ప్రధాన మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తనకు తండ్రితో సమానమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం, పేద ప్రజల అభివృద్ది కోసం ఆయన శ్రమించారని గుర్తచేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధాని ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 29, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading