Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

New Election Commissioner | కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అశోక్ లావాసా ఇటీవల రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి నియమించారు.

news18-telugu
Updated: August 21, 2020, 11:10 PM IST
Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్
రాజీవ్ కుమార్ (File)
  • Share this:
Election Commissioner Rajiv Kumar | కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న అశోక్ లావాసా ఇటీవల రాజీనామా చేశారు. ఆయన ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ వైస్ ప్రెసిడెంట్‌గా వెళ్లనున్నారు. ఈనెల 31తో అశోక్ లావాసా బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపడతారు. రాజీవ్ కుమార్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. అశోక్ లావాసా, సునీల్ చంద్ర ఇద్దరూ ఎన్నికల కమిషనర్లు. అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. మరో పది రోజుల్లో ఆయన ఎన్నికల కమిషన్‌లో చేరనున్నారు. రాజీవ్ కుమార్‌కు వివిధ రంగాలు, ప్రజా పాలసీల విషయంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన బీఎస్సీ, ఎల్ఎల్‌బీ చదువుకున్నారు. పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీలో మాస్టర్స్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీగా గత ఏడాది జూలైలో నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీబాధ్యతల నుంచి విరమణ పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక పథకాలైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ముద్రా లోన్ స్కీమ్స్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (PESB) చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో టాప్ లెవల్ రిక్రూట్‌మెంట్స్ ఈ PESBనే చూస్తుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 21, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading