ఎయిమ్స్‌లో చేరిన అరుణ్ జైట్లీ.. ఆస్పత్రికి చేరుకున్న మోదీ

Arun Jaitley | కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు.

news18-telugu
Updated: August 9, 2019, 8:39 PM IST
ఎయిమ్స్‌లో చేరిన అరుణ్ జైట్లీ.. ఆస్పత్రికి చేరుకున్న మోదీ
అరుణ్ జైట్లీ
  • Share this:
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆయన ఆస్పత్రిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్య రావడంతో ఆయన కుటుంబసభ్యులు వీల్ ఛైర్‌లో ఆస్పత్రికి తరలించారు. అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఆస్పత్రికి చేరుకున్నారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నరేంద్ర మోదీ మొదటి విడుత ఐదేళ్ల కాలంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన అమెరికా వెళ్లిన ఆయన తన ఎడమకాలుకు క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్నారు. ఫిబ్రవరి 9న అమెరికా నుంచి తిరిగివచ్చారు. గత నెలలో ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మీటింగ్స్‌కు వెళ్లినప్పుడు కూడా ఆయన చికిత్స చేయించుకున్నారు. దీంతోపాటు గత ఏడాది మేలో అరుణ్ జైట్లీ ఢిల్లీ ఎయిమ్స్‌లో రెనాల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. నరేంద్రమోదీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన అనారోగ్య కారణాలతో పదవులకు దూరంగా ఉన్నారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>