Amit Khare - PM Modi: ప్రధాని సలహాదారుగా అమిత్ ఖరే నియామకం -లాలూను జైలుకు పంపింది ఆయనే

Amit Khare as PM Modi advisor : సోషల్ మీడియాపై నియంత్రణ, సంస్కృతానికి ప్రాధాన్యమిచ్చే జాతీయ విద్యా విధానం లాంటి పాలసీలెన్నో రూపొందించిన మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారుగా నియమితులయ్యారు. కాంట్రాక్టు పద్ధతిలోొ రెండేళ్ల పాటు ఆయనా పదవిలో కొనసాగుతారు..

Amit Khare as PM Modi advisor : సోషల్ మీడియాపై నియంత్రణ, సంస్కృతానికి ప్రాధాన్యమిచ్చే జాతీయ విద్యా విధానం లాంటి పాలసీలెన్నో రూపొందించిన మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారుగా నియమితులయ్యారు. కాంట్రాక్టు పద్ధతిలోొ రెండేళ్ల పాటు ఆయనా పదవిలో కొనసాగుతారు..

  • Share this:
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొత్త సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియమితులయ్యారు. కేంద్ర సమాచారార, ప్రసార, విద్యాశాఖల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవలే రిటైరైన ఖరే.. రాబోయే రెండేళ్లు కాంట్రాక్టు పద్దతిపై ప్రధానికి సలహాదారుగా ఉంటారు. ఈ నియామకానికి కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది.

ప్రధాని సలహాదారుగా అమిత్ ఖేర్ కేంద్ర సెక్రటరీ ర్యాంకులో కొనసాగుతారు. ప్రధాని కార్యాలయంలో సలహాదారులు ఒక్కక్కరుగా తప్పుకుంటున్న క్రమంలో కొత్తగా అమిత్ ఖరే రాకకు ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం స‌ల‌హాదారులుగా పీకే సిన్హా, అమ‌ర్‌జీత్ సిన్హా ఈ ఏడాది త‌ప్పుకోవడం, ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ కూడా వెళ్లిపోవడం తెలిసిందే.

1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అమిత్ ఖరే స్వస్థలం జార్ఖండ్. 1995లో ఆయన ఉమ్మడి బీహార్ లో చైబసా జిల్లా(ఇప్పుడు జార్ఖండ్) కలెక్టర్ గా ఉన్నప్పుడు దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ కేసులో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బీహార్ లో చాలా కాలం పనిచేసి కేంద్ర సర్వీసులకు వచ్చిన ఖరే ఢిల్లీలోనే ఉండిపోయారు..

కేంద్ర విద్యా శాఖ, సమాచార ప్రసార శాఖలకు సంబంధించి మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన పాలసీలన్నీ ఖరేనే రూపొందించినట్లు చెబుతారు. దేశంలో సోషల్ మీడియా, డిజిటల్ వ్యాప్తిపై నియంత్రణ, ట్విటర్ లాంటి సంస్థలను దారికి తెచ్చుకునే ప్రయత్నం ఖరే ఐబీ శాఖలో ఉన్నప్పుడే జరిగింది. అలాగే, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే జాతీయ విద్యావిధానం రూపకల్పనలోనూ ఖరేది విశేష పాత్ర.

పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరున్న ఖరే సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారు. తిరిగి పదిరోజుల్లోనే సెక్రటరీ ర్యాంకుతో ఏకంగా ప్రధానికి సలహాదారుగా నియమితులయ్యారు. మోదీ మరో సలహాదారున్ని నియమించుకోవడంపై సోషల్ మీడియాలో భిన్నకామెంట్లు వస్తున్నాయి.
Published by:Madhu Kota
First published: