మాజీ సీఎంకి మరదలు.. ఫుట్ పాత్ మీద.. ఆమె ఇంగ్లీష్ చూసి..

ఐరా బసు

ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి మరదలు. పీహెచ్​డీ చేశారు. ఎంతో మంది విద్యార్థులుకు పాఠాలు బోధించారు. కానీ ప్రస్తుతం వీధుల వెంట తిరుగుతూ అక్కడున్న వారు పెట్టే ఆహారం తింటున్నారు.

 • Share this:
  ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రి మరదలు. పీహెచ్​డీ చేశారు. ఎంతో మంది విద్యార్థులుకు పాఠాలు బోధించారు. కానీ ప్రస్తుతం వీధుల వెంట తిరుగుతూ అక్కడున్న వారు పెట్టే ఆహారం తింటున్నారు. ఫుట్‌పాత్‌పైనే నిద్రిస్తున్నారు. ఈ హృదయవిదారక గాథ ఇరా బసుది. ఆమె పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య(Buddhadeb Bhattacharya) మరదలు. ఇది తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఆమెను ఆ స్థితిలో చూసి చాలా మంది చలించిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇరా బసు.. పశ్చిమ బెంగాల్(West Bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య.. సోదరి. ఆమె వైరాలజీలో పీహెచ్‌డీ(PhD in virology) చేశారు. ఇంగ్లీష్, బెంగాలీ రెండు భాషల్లో చాలా స్పష్టంగా మాట్లాడగలరు.ఆమె రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి. ఆమె టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవారు.

  అయితే లైఫ్ సైన్స్ టీచర్ అయిన ఇరా బసు.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని ప్రియానాథ్ బాలికల హైస్కూల్‌లో(Priyanath Girls High School ) పనిచేశారు. ఆమె 1976లో ఆ పాఠశాలలో టీచర్‌గా చేరారు. 2009 జూన్ 28న ఆమె రిటైర్డ్ అయ్యారు. అప్పటికీ బుద్ధదేవ్ భట్టాచార్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఇరా బసు బారానగర్ ప్రాంతంలో నివసించేవారు. ఆ తర్వాత లిచు బగాన్ ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె ఉంటున్న చోటు నుంచి కనిపించకుండా పోయారు. ఇక, ఆమె గత రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పైనే జీవనం సాగిస్తున్నారు.

  Bride Beats Groom: కారులో విశ్వరూపం చూపించిన వధువు.. వరుడిపై దాడి.. నవ్వులు పూయిస్తున్న వీడియో

  ఇరా బసు పనిచేసిన ప్రియానాథ్ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణకాళి చంద తాజాగా మాట్లాడుతూ.. ‘ఇరా బసు ఇక్కడే పాఠాలు బోధించేవారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆమెకు రావాల్సిన పెన్షన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని, పేపర్స్ సమర్పించాలని కోరాం. అయితే ఆమె ఆ పని చేయలేదు. దీంతో ఆమె పెన్షన్ పొందలేకపోతున్నారు. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న డన్‌లప్‌లోని ఆర్టియజోన్ ఆర్గనైజేషన్ సభ్యులు ఇరా బసును పూలమాలతో సత్కరించి స్వీట్లు తినిపించారు. టీచర్లందరూ తనను ఇంకా ఇష్టపడుతున్నారని.. చాలామంది విద్యార్థులకు తానింకా గుర్తున్నానని ఇరా బసు(Ira Basu) ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. 2001 నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక ఘట్టాలు ఇవే..

  బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఇరా బసు మాట్లాడుతూ.. ‘టీచర్‌గా నా కెరియర్‌ను ప్రారంభించిన సమయంలో బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. నా శ్రమతోనే నేను బతికాను. మా కుటుంబాల మధ్య బంధుత్వం చాలా మందికి తెలిసిందే అయినప్పటికీ.. వీఐపీ ఐడెంటిటీని కోరుకోలేదు’అని చెప్పారు. ఇక, ఇరా బసుల ఈ పరిస్థితుల్లో రోడ్లపై జీవనం సాగిస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన అధికారులు ఆమెను కోల్​కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
  Published by:Sumanth Kanukula
  First published: