Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    కోమాలోకి వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి...

    ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

    news18-telugu
    Updated: May 10, 2020, 2:42 PM IST
    కోమాలోకి వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి...
    అజిత్ జోగి (File)
    • Share this:
    ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయిపూర్‌లోని శ్రీ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందడం లేదు. దీంతో మెదడు మీద ప్రభావం చూపింది. ఆయన కోమాలోకి వెళ్లిపోయినట్టు వైద్యులు తెలిపారు. 74 సంవత్సరాల అజిత్ జోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు శ్రీ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. 74 ఏళ్ల అజిత్ శనివారం ఉదయం చింతపండు తినేటప్పుడు, ప్రమాదవశాత్తూ అందులోని గింజ ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుంది. దీంతో ఆయన ఇంట్లో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ జరిగిందని అంతా కంగారు పడ్డారు. అయితే ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి శ్వాస నాళం నుండి గింజను తొలగించారు. ఆయనకు మొదట హార్ట్ ఎటాక్ వచ్చిందని భావించారు. 
    Published by: Ashok Kumar Bonepalli
    First published: May 10, 2020, 2:36 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading