Ranjit Sinha: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి.. కరోనా నిర్ధారణ అయిన మరుసటి రోజే కన్నుమూత

రంజిత్ సిన్హా

రంజిత్ సిన్హా..డిసెంబరు 2012 నుంచి 2014 వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకు ముందు ఢిల్లీ, పాట్నాల సీబీఐలో కీలక పదవుల్లో ఉన్నారు. అంతేకాదు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) హెడ్‌గా పనిచేశారు.

  • Share this:
    సీబీఐ మాజీ డెరెక్టర్ రంజిత్ సిన్హా (68) ఇకలేరు. శుక్రవారం ఉదయం 04.30 గంటల సమయంలో ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రే ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఆ మరుసటి రోజే రంజిత్ సిన్హా కన్నుమూశారు. రంజిత్‌ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన బీహార్ కేడర్ రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి. డిసెంబరు 2012 నుంచి 2014 వరకు ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకు ముందు ఢిల్లీ, పాట్నాల సీబీఐలో కీలక పదవుల్లో ఉన్నారు. అంతేకాదు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) హెడ్‌గా పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో వివాదాస్పద కేసులను రంజిత్ సిన్హా డీల్ చేశారు.

    2014 తర్వాత వరుస వివాదాలు రంజిత్ సిన్హాను చుట్టముట్టిన విషయం తెలిసిందే. ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జార్ఖండ్ బొగ్గు గనుల స్కామ్‌లో ఆయన నిందితులతో చేతులు కలిపారని.. సీబీఐ చీఫ్ స్థానంలో ఉండి సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోల్ స్కామ్ కేసులో నిందితులతో తన ఇంట్లోనే సమావేశమయ్యారని ఆరోపణలు రావడంతో ఆయనపై 2017లో సీబీఐ కేసు పెట్టింది. దీనిపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ములాయం సింగ్ అక్రమాస్తుల కేసులోనూ రంజిత్ సిన్హాపై ఆరోపణలు వచ్చాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: