FORMER BRITISH PRIME MINISTER DAVID CAMERON CALLS FORMER INDIAN PM MANMOHAN SINGH AS SAINT MK
మన్మోహన్ సింగ్ ఒక మహర్షి లాంటి వారు...బ్రిటన్ మాజీ ప్రధాని వెల్లడి
డేవిడ్ కామెరూన్, మన్మోహన్ సింగ్
2011లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడులు లాంటి దాడి మరోసారి జరిగితే పాక్పై భారత్ సైనిక చర్య తీసుకోవలసి ఉంటుందని భారత్ పర్యటన సందర్భంగా మనోహన్ను కలిసినప్పుడు ఆయన తనతో అన్నారని కామెరాన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రుషిలాంటి మనిషి అని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. ‘ఫర్ ది రికార్డ్’ పేరిట తాను రాసిన ఆత్మకథలో కామెరూన్ భారత్ తో ఉన్న అనుబంధం గురించి పేర్కొన్నారు. అలాగే భారత్ ఎదుర్కొన్న ఉగ్రదాడుల ముప్పు విషయంలో మన్మోహన్ కఠినంగానే ఉన్నారని, 2011లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడులు లాంటి దాడి మరోసారి జరిగితే పాక్పై భారత్ సైనిక చర్య తీసుకోవలసి ఉంటుందని భారత్ పర్యటన సందర్భంగా మనోహన్ను కలిసినప్పుడు ఆయన తనతో అన్నారని కామెరాన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే భారత్ ఎదుర్కొన్న పలు సంక్షోభాలను మన్మోహన్ ధృఢచిత్తంతో ఎదుర్కొన్నారని డేవిడ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.
బ్రిటన్ ప్రధాని హోదాలో కామెరాన్ 2010-16 మధ్యలో భారత్లో మూడు సార్లు పర్యటించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై నిర్వహించిన రెఫరెండం నేపథ్యంలో 2016లో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ‘ఫర్ ది రికార్డ్’ పేరిట విడుదల చేసిన తన ఆత్మకథలో భారత్ పట్ల తన విధానం గురించి ఆయన పలు ప్రస్తావనలు చేశారు.