హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar: మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్​లోని ఎమర్జెన్సీ వార్డులో చేరిన నాయకుడు

Bihar: మాజీ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్​లోని ఎమర్జెన్సీ వార్డులో చేరిన నాయకుడు

లాలూ ప్రసాద్​ యాదవ్​ (ఫైల్​)

లాలూ ప్రసాద్​ యాదవ్​ (ఫైల్​)

ఆర్జేడీ అధ్యక్షుడు,  బిహార్​ మాజీ ముఖ్యమంత్రి (bihar former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌ (delhi AIIMS)లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు.

ఆర్జేడీ అధ్యక్షుడు,  బిహార్​ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS)లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. గురువారం లాలూ ప్రసాద్ యాదవ్ పట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. శుక్రవారం ఆయన ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో (Emergency ward) చేరారు. అయితే ఆర్జేడీ అధ్యక్షుడిని అకస్మాత్తుగా అత్యవసర విభాగం (ఎయిమ్స్)లో ఎందుకు చేర్చారనేది ఇంకా తెలియరాలేదు.

నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ,..

అనారోగ్య కారణాలతో లాలూ యాదవ్ గురువారం పట్నా (Patna) నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఆయన ఎయిమ్స్ నుంచి అత్యవసర విభాగంలో చేరారు. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం బీహార్ ప్రభుత్వం (Bihar government)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ, ఆయన నితీష్ ప్రభుత్వాన్ని (Nitish government) తీవ్రంగా విమర్శించారు. విద్య, ఆరోగ్యం రంగంలో బీహార్ వెనుకబడి ఉందని లాలూ యాదవ్ మండిపడ్డారు. ఆర్జేడీ అధ్యక్షుడు నితీశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు లాలూ. ఈ ప్రభుత్వం అభివృద్ధి నినాదాన్ని ఇస్తుందని అన్నారని, కానీ, నీతి ఆయోగ్ నివేదిక తర్వాత, బీహార్ అభివృద్ధి వాదనలు బహిర్గతమయ్యాయని లాలూ ప్రసాద్​ యాదవ్​ విమర్శలు గుప్పించారు.

పశుగ్రాసం కుంభకోణంలో..

1996లో బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. (ఈ దర్యాప్తును లాలూ ఆదేశించారు). పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానంలో సతీమణి (wife) రాబ్డీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించాడు. ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లారు. కాగా, ఆయన జైలులో ఉండగా అనారోగ్యానికి గురయ్యారు.

ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ గదిలో ....

మాజీ సీఎం లాలూ యాదవ్ ఆరోగ్యం (health) చాలా కాలంగా బాగా లేదని తెలిసిందే. పశుగ్రాస కుంభకోణం కేసులో జైలులో ఉండగానే ఢిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS)లో చేర్పించారు. అంతకు ముందు కూడా రిమ్స్‌లో చికిత్స పొందారు. జైలు నుంచి బెయిల్ (bail) పొందినా లాలూ యాదవ్ అనారోగ్య కారణాలతో ఢిల్లీలోనే ఉన్నారు. చాలా నెలల తర్వాత ఆయన పట్నా చేరుకున్నారు. అయితే, మరోసారి ఆయన గురువారం ఢిల్లీ వెళ్లారు. ఈ సమయంలో నీతి ఆయోగ్ (niti ayog) నివేదికను ప్రస్తావిస్తూ, సీఎం నితీష్ కుమార్ పూర్తి నీటిలో మునిగిపోవాలని సూచించారు. హఠాత్తుగా లాలూ యాదవ్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ గదిలో చేర్చారనే వార్త కలకలం రేపింది. లాలూ యాదవ్‌ను ఎమర్జెన్సీకి ఎందుకు చేర్చాల్సి వచ్చిందనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు.

దీనిపై ఇప్పటి వరకు ఆర్జేడీ లేదా ఎయిమ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. లాలూ రొటీన్ చెకప్ ల కోసం డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్తుంటారు. అయితే, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చేరడం వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీలో నాయకులు చెబుతున్నారు.

First published:

Tags: Aiims, Bihar, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు