Home /News /national /

FORMER AIADMK LEADER VK SASIKALA MET WITH ACTOR RAJINIKANTH AND HIS WIFE LATHA AT HIS RESIDENCE IN CHENNAI PRV

sasikala meets rajinikanth: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సూపర్​ స్టార్​ రజనీకాంత్​తో జయలలిత నిశ్చెలి శశికళ భేటీ..

రజనీకాంత్​, ఆయన భార్యతో శశికళ (Photo:ANI/Twitter)

రజనీకాంత్​, ఆయన భార్యతో శశికళ (Photo:ANI/Twitter)

శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే (AIADMK) సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. ఇక శశికళకు తమిళనాడులో కష్టకాలమే అనుకుంటున్న తరుణంలో ఆమె మరో ఆసక్తికర, అనూహ్య ఎత్తుగడ వేశారు.

ఇంకా చదవండి ...
తమిళనాడు (Tamil Nādu) రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ లోకి ఆ పార్టీ బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ (sasikala) రీ ఎంట్రీ పై  పన్నీర్ సెల్వం (paneer Selvam) ఇటీవలె సానుకూల వ్యాఖ్యలు చేశారు. శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ హైకమాండ్ (party high command) చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేత ఓ పన్నీర్‌ సెల్వం అన్నారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో ముసలం నెలకొంది. ఇదే అదునుగా శశికళ అన్నాడీఎంకేని తన చేతుల్లోకి తీసుకోవాలని పావులు కదుపుతూ వచ్చింది. శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే (AIADMK) సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. పార్టీ సమయ్వయ కర్త (Party Coordinator)గా పన్నీర్‌సెల్వం , ఉప సమన్వయకర్త (Joint Coordinator)గా పళనిస్వామి ఏక్రీవంగా ఎన్నికయ్యారు. ఇక శశికళకు తమిళనాడులో కష్టకాలమే అనుకుంటున్న తరుణంలో ఆమె మరో ఆసక్తికర, అనూహ్య ఎత్తుగడ వేశారు.

తమిళ రాజకీయాల్లో వేడి..

దివంగత జయలలిత హయాంలో అన్నాడీఎంకే (AIADMK) తరఫున అన్నీ తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళ.. జయ మరణానంతర పరిణామాలతో పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ పార్టీ కైవసం కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు ప్రతికూలంగా ఉన్నా తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారు.. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‎ తో శశికళ భేటీ (sasikala meets Rajinikanth) తమిళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. పోయెస్ గార్డెన్‎లోని రజినీ నివాసానికి వెళ్లిన శశికళ 40 నిముషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. కాసేపటికి రజనీకాంత్‎ను ఎందుకు కలిశారో ప్రకటన విడుదల చేశారు. “రజినీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రకటనలో శశికళ తాను అన్నాడీఎంకే చీఫ్‎గా..

కానీ ఉద్దేశం అది కాదని.. అసలు వ్యూహం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తలైవాను సీఎం స్టాలిన్ నేరుగా వెళ్లి పరామర్శించారు. అన్నాడీఎంకే నుంచి ముఖ్య నేతలు ఎవరూ పరామర్శించలేదు. ఇక అన్నాడీఎంకే భవిష్యత్ నాయకురాలిని నేనే అని పదే పదే చెప్పుకొంటోంది చిన్నమ్మ. ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో చేస్తోంది కూడా. రజినీతో భేటీ (sasikala meets Rajinikanth) కి సంబంధించిన ప్రకటనలో శశికళ తాను అన్నాడిఎంకే చీఫ్‎గా ప్రకటించుకోవడం చర్చించాల్సిన అంశమే..

ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనేది స్పష్టం అయింది. దీంతో రజినీకాంత్‎ను నేరుగా వెళ్లి కలవడం (sasikala meets Rajinikanth) ద్వారా రజినీ అభిమానులను ఆకర్షించడం.. రజినీతో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పడం లాంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ భేటి జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రజనీతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఏం జరగబోతోంది అని రజనీ అడగడం.. అంతా మంచే జరగబోతోంది అని శశికళ చెప్పడం.. సందర్భం వచ్చినపుడు మద్దతు కావాలని చిన్నమ్మ తలైవాను కోరడం లాంటి ఆసక్తికరమైన సంభాషణలతో భేటి సాగినట్లు సమాచారం.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: AIADMK, Politics, Rajni kanth, Tamilnadu

తదుపరి వార్తలు