Women CRPF: సీఆర్‌పీఎఫ్‌ మహిళా దళాలకు ఏకే-47 రైఫిల్స్.. ఇకపై వీవీఐపీ సెక్యూరిటీ విధులు

Women CRPF: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకొని రాబోయే యూపీ ఎలక్షన్లలో వీవీఐపీలకు భద్రత కల్పించడానికి సీఆర్‌పీఎఫ్‌ మహిళా బృందాన్ని నియమించింది

Women CRPF: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకొని రాబోయే యూపీ ఎలక్షన్లలో వీవీఐపీలకు భద్రత కల్పించడానికి సీఆర్‌పీఎఫ్‌ మహిళా బృందాన్ని నియమించింది

  • Share this:
మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో మనదేశం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. సైన్యంలో చేరాలనుకున్న వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఇతర భద్రతా బలగాల్లో మహిళల నియామకాలు పరిమితంగానే ఉన్నాయి. ఈ క్రమంలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించింది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌). అతి ముఖ్యమైన ప్రముఖులకు(VVIPs) భద్రత కోసం సీఆర్‌పీఎఫ్‌ మహిళా బృదం రక్షణ కల్పించనుంది. త్వరలోనే 33 మందితో కూడిన ఈ టీమ్‌కు 10 వారాల ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కొన్ని రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ వీరి సెలక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంపిక పూర్తయింది. రానున్న రోజుల్లో సీఆర్‌పీఎఫ్‌(CRPF)లో మహిళల సంఖ్యను మరింత పెంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ప్రారంభంలో ఆరు ప్లటూన్ల మహిళా సిబ్బందిని తీసుకుంటామని చెప్పారు.

Exam dress code : స్టూడెంట్‌కు షాక్... పొట్టి డ్రస్ వేసుకుందని ఇలా చేశారు.. !

అవసరానికి అనుగుణంగా నియామకాలు ఉంటాయని, అయితే కొంమంది ప్రముఖులకు మొదటి బ్యాచ్ మహిళా సిబ్బందిని కేటాయిస్తామని సదరు అధికారి తెలిపారు. ఈ బృందానికి ఏకే-47 (AK-47 rifle) లాంటి రైఫిల్స్ ఫైరింగ్ శిక్షణ కుడా ఇచ్చామని తెలిపారు. హోంమంత్రి అమిత్ షా (Amit Shah), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) లాంటి అగ్రశ్రేణి ప్రముఖులతో సహా అనేక కీలక వ్యక్తులకు సీఆర్‌పీఎఫ్‌ రక్షణ కల్పిస్తోంది.'

Trains Delay: దేశంలోని రైళ్లు ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి.. రైల్వేశాఖ ఏం చెబుతోంది?

పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల సమయంలో జరిగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకొని రాబోయే యూపీ ఎలక్షన్ల (Uttar Pradesh assembly Elections)లో వీవీఐపీలకు భద్రత కల్పించడానికి సీఆర్‌పీఎఫ్‌ మహిళా బృందాన్ని నియమించింది. బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కొందరు నాయకుల ర్యాలీలు, రోడ్ షోల్లో దాడులు జరిగాయి. రానున్న ఎన్నికల్లో ప్రముఖులపై ఇలాంటి భయానక దాడులు జరిగే అవకాశముందని అధికారులు భావించారు.

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ తాజా హెచ్చరిక

వచ్చే ఫిబ్రవరి-మార్చిలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హోంశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత సీఆర్‌పీఎఫ్‌లో మహిళా సిబ్బందిని చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైందని, ఇది దశలవారీగా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ ఇటీవల జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షాకు సీఆర్‌పీఎఫ్‌ వివరాలను, తక్షణ భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఈ సమావేశం అనంతరం మహిళలను చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
Published by:Shiva Kumar Addula
First published: