ఇండిగో విమానంలో అర్నబ్ పట్ల దురుసు ప్రవర్తన..కమెడియన్‌పై 6 నెలల నిషేధం

ఇండిగో విమానంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు కమెడియన్ కునాల్‌పై ఆ సంస్థ ఆరు మాసాల నిషేధం విధించింది.

news18-telugu
Updated: January 29, 2020, 8:12 AM IST
ఇండిగో విమానంలో అర్నబ్ పట్ల దురుసు ప్రవర్తన..కమెడియన్‌పై 6 నెలల నిషేధం
జర్మనీ విషయానికి వస్తే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందని.. వారి అభ్యర్థనను ప్రస్తుతం ప్రాసెసింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి అనేక దేశాల నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నాయని.. అయితే తాము ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.
  • Share this:
ఇండిగో విమానాల్లో  ప్రయాణించకుండా కమెడియన్ కునాల్ కమ్రాపై ఆ సంస్థ ఆరు మాసాల నిషేధం విదించింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సహ ప్రయాణీకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ముంబై - లక్నో ఇండిగో విమానంలో ప్రయాణించిన కునాల్ కమ్రా...సహ ప్రయాణీకుడు అర్నబ్ గోస్వామిని దుర్భాషలాడుతూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నువ్వు పిరికిపందవా? జర్నలిస్టువా? అంటూ అర్నబ్ నుద్దేశించి కునాల్ ప్రశ్నించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లుకొట్టింది.


ఇండిగో విమానంలో కునాల్ కమ్రా ప్రవర్తన సక్రమంగా లేనందున..మరో ఆరు మాసాల పాటు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విదిస్తున్నట్లు ఇండిగో ట్వీట్ చేసింది. ఇండిగో విమానంలో ప్రయాణించే సమయంలో సహ ప్రయాణీకుల పట్ల అనుచితంగా ప్రవర్తించ వద్దని ప్రయాణీకులకు సూచిస్తూ ఇండిగో మరో ట్వీట్ చేసింది. ప్రయాణీకుల రక్షణకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించింది.విమానంలో అనుచిత ప్రవర్తతో సహ ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడంతో పాటు ఇతర ప్రయాణీకుల భద్రతకు భంగం కలిగించేలా కునాల్ ప్రవర్తన ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. అతనిపై ఇతర విమానయాన సంస్థలు కూడా ఇండిగో తరహాలోనే నిషేధం విధించాలని సూచించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తమ విమానాల్లో ప్రయాణింకుండా ఎయిరిండియా కునాల్‌పై నిషేధం విధించింది.


తనపై ఇండిగో విమానం ఆరుమాసాల నిషేధం విదించడంపై స్పందించిన కునాల్...ఎయిరిండియాపై ప్రధాని మోదీ జీవితకాల నిషేధం విధించనున్నారంటూ ఎద్దేవా చేశారు.

Published by: Janardhan V
First published: January 29, 2020, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading