నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటు బాలీవుడ్ ప్రముఖులు షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, కరణ్ జోహార్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం ప్రారంభ వేడుకలో నీతా అంబానీ ప్రదర్శనకు ప్రజలు నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రకటించారు.
కల్చరల్ సెంటర్ తరపున , దేశ ప్రజలందరి తరుపున... ప్రేక్షకులందరకీ నీతా అంబానీ.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి సంబంధించిన ఈ సంగీత చరిత్రను అందించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉందన్నారు. భారతదేశం నుండి ఇది ప్రారంభమైందని తెలిపారు. మన సంస్కృతి వేల సంవత్సరాలుగా మనుగడ సాగించడమే కాదు, అభివృద్ధి చెందిందన్నారు నీతా అంబానీ. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో మనది ఒకటి... అలాగే, అత్యంత వైవిధ్యమైనది అని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో, మనం ప్రపంచంలోని అతి పిన్న వయస్కులలో ఒకటిగా ఉన్నామన్నారు. ఈ రోజు మనం ఆధునిక భారతదేశంలో అమృత్ కాల్‌లో ఉన్నామని తెలిపారు.
1.4 బిలియన్ల భారతీయులు గర్వించదగిన, సంపన్నమైన, బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన దేశం కోసం అద్భుతమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇది ఒక శుభ సమయం అని తెలిపారు నీతా అంబానీ. ముఖేష్, తన ఎన్‌ఎంఎసిసి కల సాకారమైంది ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశానికి ప్రపంచ స్థాయి సాంస్కృతిక కేంద్రం ఉండాలని చాలా కాలంగా తామ కలలు కన్నామన్నారు. మా కళాత్మక , సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, ఆ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక స్థలాన్ని సృష్టించడానికి మేము చాలా ఆసక్తితో ఉన్నామని తెలిపారు.
సినిమా మరియు సంగీతంలో,
నాట్యం మరియు నాటకంలో,
సాహిత్యం మరియు జానపద కథలలో,
కళలు మరియు చేతిపనులలో,
సైన్స్ మరియు ఆధ్యాత్మికతలో,
అవన్నీ భారతదేశానికి అవ్యక్త జాతీయ సంపద అన్నారు.
సంస్కృతి పరస్పర అవగాహన, సహనం, గౌరవం అనే దారాలను అందంగా నేసి.. వివిధ జాతులను... దేశాలను కలుపుతుందన్నారు. సంస్కృతి మానవాళికి ఆశ , ఆనందాన్ని ఇస్తుందన్నారు. కాబట్టి, తాము ఏర్పాటు చేసే.. ఈ కల్చరల్ సెంటర్.. ఒక కళాకారుడిగా, కళలు, కళాకారులు, ప్రేక్షకులను జరుపుకునే ప్రదేశంగా మారుతుందని తాను ఆశిస్తున్నానన్నారు. మన ప్రజలు తమ గురించి గర్వంగా భావించే స్థలం ఇది అన్నారు నీతా అంబానీ.
కళలు, సంస్కృతి, విజ్ఞానాల సంగమ కేంద్రంగా ఉండాలన్నారు. కల్చరల్ సెంటర్ భారతీయ నగరాల నుండి వచ్చేవారికి మాత్రమే కాకుండా, మన చిన్న పట్టణాలు , మారుమూల గ్రామాల నుండి కూడా వచ్చే కళాకారుల అత్యుత్తమ ప్రతిభకు నిలయంగా మారాలని తాము భావిస్తున్నామన్నారు. ఈ స్థలం మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని , సాధికారతను అందిస్తుందని తాను నిజంగా ఆశిస్తున్నానన్నారు. మనకు వేదిక ఉన్నంత కాలం, మాకు ఒక వాయిస్ ఉంటుంది. మనకు స్వరం ఉన్నంత కాలం, మన కథలను చెప్పగల శక్తి, మన చరిత్రను రూపొందించడానికి కథలు, విధితో కొత్త ప్రయత్నాన్ని సృష్టించే కథలు , ప్రపంచాన్ని మంచిగా మార్చడానికి కథలు ఉన్నాయిని పేర్కొన్నారు
ఈ రోజు ఈ గ్రాండ్ థియేటర్‌లో తాను స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నప్పుడు, తాను ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలాంటి ఉత్సాహం ఉండేదో ఇప్పుడు అదే ఉత్సాహాన్ని అనుభవించకుండా ఉండలేకపోయానన్నారు నీతా అంబానీ. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా, ఆ చిన్న వయస్సులో అనుభవించిన అదే శక్తి , కృతజ్ఞతా భావాన్ని తాను ఇప్పటికీ ఫీల్ అవుతున్నా అన్నారు. కాలేజీలో తన మొదటి నాటకం ఫిరోజ్ అనే యువ ప్రతిభావంతుడైన నటుడితో కలిసి చేసిన విషయం తనకు ఇప్పటికీ గుర్తుందన్నారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు.. ఈ రోజు మొదటి థియేట్రికల్ డైరెక్టర్‌గా తిరిగి నా స్నేహితుడు ఫిరోజ్ ఇక్కడ ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు.
తన ప్రసంగం ముగించే ముందు, తనపై ఇంత నమ్మకం , విశ్వాసం ఉంచినందుకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాన్నారు. మహిళా సాధికారతపై నమ్మకం ఉంచి, గొప్పగా ఆలోచించి తన కలలను సాకారం చేసుకోమని ప్రోత్సహించిన తన మామగారు శ్రీ ధీరూభాయ్ అంబానీని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తాను స్మరించుకుంటున్నాని నీతా అంబానీ అన్నారు. తన తండ్రి శ్రీ రవీంద్రభాయ్‌కి ఇష్టమైన రఘుపతి రాఘవ్ భజన చేస్తున్నప్పుడు తాను చాలా చలించిపోయాన్నారు. ఆయన సౌమ్యత , కరుణ తనను నడిపిస్తూనే ఉన్నాయన్నారు నీతా అంబానీ.
ఈ రోజు ప్రేక్షకుల మధ్య ఉన్న తన తల్లికూడా కూర్చున్నారని.. ఆమె ప్రేమ, సానుకూలత, ఆధ్యాత్మికత తనను ఓ మంచి వ్యక్తిగా మార్చడంలో కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. తన అత్తగారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారన్నారు. ఆమె నిరంతరం తనకు మోటివేట్ చేస్తూ.. ఇనస్పిరేషన్‌గా ఉన్నార్నారు. ఇక తన ఆరుగురు పిల్లలు - ఇషా, ఆనంద్, శ్లోక, ఆకాష్, రాధిక, అనంత్ -వారు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు నీతా అంబానీ.
తన ముగ్గురు విలువైన మనవళ్లు - పృథ్వీ, ఆదియ శక్తి కృష్ణ తన బలమన్నారు. తన జీవితంలోని స్వచ్ఛమైన సంతోషాలన్నారు. కళ వారి జీవితాలను చాలా అందమైన మార్గాల్లో తాకుతుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. కళ ప్రతి బిడ్డకు , రాబోయే తరాలకు వారి సృజనాత్మకతను, వారి ఎంపికలను, వారి వ్యత్యాసాలను, వారి ఆశలను , వారి కలలను జరుపుకునే అవకాశాన్ని కల్పిస్తూ, స్ఫూర్తిని పొందేలా మరియు శక్తివంతం చేస్తూనే ఉండనివ్వండి అని పేర్కొన్నారు నీతా. తన ప్రతి కలలో ఎప్పుడూ నమ్మకం ఉంచిన తన ప్రియమైన భర్త ముఖేష్‌కి కృతజ్ఞతలు తెలపిారు. ముఖేష్ లేకుంటే ఏమీ సాధ్యం కాదన్నారు. జీవిత ప్రయాణాన్ని ఇంత అందంగా చేసినందుకు ధన్యవాదాలు అన్నారు నీతా.
ఇప్పుడు, అపారమైన గర్వం మరియు ఆనందంతో, నేను నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించాను. ఇది నవ భారతదేశానికి , మన అందమైన దేశానికి సవినయంగా ఈ సెంటర్‌ను అంకితం చేస్తున్నానని నీతా అంబానీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Nita Ambani