హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Baramulla Encounter: టెర్రరిస్ట్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎన్‌కౌంటర్‌లో ఖేల్ ఖతమ్

Baramulla Encounter: టెర్రరిస్ట్‌గా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్.. ఎన్‌కౌంటర్‌లో ఖేల్ ఖతమ్

అమీర్ సిరాజ్

అమీర్ సిరాజ్

అమీర్ సిరాజ్ ఈ ఏడాది జులై నుంచి కనిపించకుండా పోయాడు. ఫుట్‌బాల్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్తున్నానని చెప్పి.. సోపోర్‌లోని ఆదిపోరా ప్రాంతంలోని తన మేనమామ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు.

  జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన ముష్కర మూకలను మన సైన్యం మట్టుబెట్టుతోంది. గురువారం బారాముల్లా (Baramulla) జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో ఒకరు కాశ్మీరీ కాగా.. మరొకరు పాకిస్తానీ. కాశ్మీర్‌కు చెందిన ఆ టెర్రరిస్టును అమీర్ సిరాజ్‌ (Amir Siraj)గా పోలీసులు గుర్తించారు. అమీర్ సిరాజ్ కాలేజీ విద్యార్థి. అంతేకాదు ఫుట్‌బాల్ ప్లేయర్. కాలేజీలో బుద్ధిగా చదువుకుంటూ ఫుట్‌బాల్ ఆడుకునే సిరాజ్.. ఇటీవలే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ గ్రూప్‌లో చేరిన కొన్ని రోజుల్లోనే ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు సిరాజ్.

  బారాముల్లాలోని వనిగమ్ పయీన్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారని భద్రతా దళాలకు గురువారం సమాచారం అందింది. రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. వారు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని కోరారు. కానీ ఉగ్రవాదులు వినలేదు. భద్రతాదళాలపైకి కాల్పులు జరపడంతో... ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టిన భద్రతా దళాలు.. ఎదురుకాల్పుల్లో ఆ ఇద్దరిని మట్టుబెట్టాయి. వారిలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన అర్బ్రార్ అలియాస్ లాంగూగా గుర్తించారు. మరొకరు ఫుట్‌బాల్ ప్లేయర్ సిరాజ్. అతడి స్వస్థలం సోపోర్. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ సిరాజ్ ఈ ఏడాది జులై నుంచి కనిపించకుండా పోయాడు. ఫుట్‌బాల్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్తున్నానని చెప్పి.. సోపోర్‌లోని ఆదిపోరా ప్రాంతంలోని తన మేనమామ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అతడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడని ఇటీవలే తెలిసింది. సిరాజ్‌కు ఇంతకు ముందు ఉగ్రమూలాలు లేవు. ఐతే ఆదిపోరా ప్రాంతం నుంచి గతంలో చాలా మంది యువకులు ఉగ్రవాదులుగా మారారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై అమీర్ సిరాజ్ కూడా టెర్రరిస్టుగా మారిపోయాడని పోలీసులు తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Encounter, Jammu and Kashmir, Terrorism, Terrorists

  ఉత్తమ కథలు