Rs.2k Notes: ఇటీవలే రూ.2 వేల నోటును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం అందరికీ 2016 డీమానిటైజేషన్ పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. అయితే గతంలో మాదిరిగా ప్రజలకు ఇబ్బందులు మాత్రం ఎదురుకావట్లేదు. ఎందుకంటే గతంలోనే వీటి ముద్రణ, లభ్యత చాలా వరకు తగ్గాయి. దీంతో సామాన్యులపై ఆర్బీఐ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపట్లేదు. అయితే ఈ కరెన్సీ నోట్లు దాచుకున్న ప్రజలు, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. ఎక్కువ మంది షాపింగ్ చేయడానికి రూ.2 వేల నోటును వినియోగిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.
* బ్యాంకుల వద్ద చిన్న క్యూలు
రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు 131 రోజుల గడువును రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో బ్యాంకుల వద్ద ప్రస్తుతం చిన్న క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కస్టమర్లు తీవ్ర గందగరోళం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వివిధ బ్యాంకుల్లో ఎక్స్ఛేంజ్ విధానం ఒక్కోలా ఉంది. ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం లేదని పేరు, మొబైల్ నంబర్ అందించమని కస్టమర్లను కొన్ని బ్యాంకులు కోరుతున్నాయి. మరి కొన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్ ఎంట్రీలను అనుసరిస్తున్నాయి. ఇంకొన్ని బ్యాంకులు పాన్ లేదా ఆధార్ కార్డ్‌లను సమర్పించమని కస్టమర్‌లను అడిగాయి. మరికొన్ని బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి బదులుగా అకౌంట్‌లో డిపాజిట్ చేయమని సలహా ఇచ్చాయి.
* కొన్ని దుకాణాలకు బొనాంజా, మరికొన్నింటికి బాధ
దేశంలోని చాలా దుకాణాలు రూ.2,000 నోట్లను తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ నోట్లను ఆసక్తిగా స్వీకరిస్తున్నాయి. ఉదాహరణకు చాలా మంది మామిడి పండ్లు కొనుగోలు చేసేందుకు రూ.2 వేల నోట్లనే ఇస్తున్నట్లు మామిడి పండ్ల అమ్మకందారులు చెబుతున్నారు. నోట్లను తీసుకుంటున్న కారణంగానే యధావిధిగా వ్యాపారం జరుగుతోందని పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 30 గడువులోపు సేకరించిన మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా వినియోగదారులు అధిక విలువ కలిగిన కరెన్సీని ఉపయోగించి చెల్లింపులు చేయడంతో కొన్ని బ్రాండెడ్ దుకాణాల అమ్మకాలు పెరిగాయి. అయితే కొన్ని షాపుల యజమానులు నోట్లను తమ బ్యాంకు అకౌంట్‌లలో జమ చేయడంలో ఎదురయ్యే చిక్కుల గురించి భయపడి వాటిని స్వీకరించడానికి అంగీకరించడం లేదు. ఈ మేరకు షాప్‌ల ఎంట్రన్స్‌లకు ముందే రూ.2వేల నోట్లు తీసుకోవట్లేదని నోటీస్ అంటిస్తున్నాయి.
Viral: ఉమ్మి అమ్మి లక్షల సంపాదన.. ఆమె వాడిన దుస్తులు,బెడ్‌షీట్స్‌కు ఫుల్ డిమాండ్..!
* పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు
దుకాణాలతో పాటు, ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద త్వరలో ఉపసంహరించుకోనున్న రూ.2,000 నోట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా రూ.2 వేల నోట్లు ఎక్స్ఛేంజ్ చేసే అవకాశం ఉన్న ప్రతి చోట ప్రజల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని, ఫ్యూయల్ స్టేషన్లలో రద్దీ పెరిగిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. కొంతమంది ఆపరేటర్లు రూ.2,000 నోట్లను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నారు. మరి కొందరు బిజినెస్ పరంగా ఆలోచించి యాక్సెప్ట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rs 2000 Note