హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Railways: తత్కాల్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే టికెట్ కన్ఫార్మ్..

Indian Railways: తత్కాల్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే టికెట్ కన్ఫార్మ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IRCTC - Tatkal ticket booking: తత్కాల్ టిక్కెట్లు పరిమితంగానే ఉంటాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణానికి ఒక రోజు ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత కష్టతరమవుతుంది. టికెట్ సులువుగా బుక్ చేసుకునేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...

కరోనా తరువాత దూరపు ప్రయాణాలు చేసేవారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో మాదిరిగా సులభంగా రైళ్లలో ప్రయాణించే అవకాశాలు లేవు. సంక్రాతి సెలవుల సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారు రైల్వే టికెట్ల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. రైలు టిక్కెట్ల సాధారణ బుకింగ్‌లు అయిపోయినప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్‌లపైనే ఆశలు పెట్టుకుంటారు. ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఏసీ టికెట్ బుకింగ్ కోసం టైమ్ స్లాట్‌ను ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు. స్లీపర్ క్లాస్ టికెట్ కోసం ఉదయం 11 గంటలకు టైమ్ స్లాట్ ఉంటుంది. తత్కాల్ టిక్కెట్లు పరిమితంగానే ఉంటాయి. వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణానికి ఒక రోజు ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత కష్టతరమవుతుంది. కానీ ఇలాంటప్పుడు కూడా వినియోగదారులు సులభంగా IRCTC టికెట్లను పొందవచ్చు. ఇందుకు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని, బుకింగ్ సమయానికి సిద్ధంగా ఉండాలి.

ఇంటర్‌నెట్ స్పీడ్

టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ వెబ్‌సైట్ లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా టికెట్‌ బుకింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తవచ్చు. దీనివల్ల పేమెంట్‌ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ ఉంటే ఇలాంటి సమస్యలు లేకుండా సులభంగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.

OTP అవసరం లేకుండా పేమెంట్

IRCTCలో టికెట్ బుకింగ్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సాధ్యమైనంత తొందరగా పేమెంట్ చేయవచ్చు. కానీ ఇందుకు OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆలస్యం కాకుండా, OTP అవసరం లేని ఈ-వాలెట్, PayTM, UPI వంటి పేమెంట్ ఆప్షన్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఇది ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది. దీనివల్ల బుకింగ్ ఆలస్యం కాదు.

మాస్టర్ లిస్ట్

ప్రయాణికుల సంఖ్యను బట్టి వివరాలను సేవ్ చేయడానికి మాస్టర్ లిస్ట్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవాలి. ఇందుకు IRCTC వెబ్‌సైట్లోని మాస్టర్‌ లిస్ట్‌లో ప్రయాణికులు తమ వివరాలను సేవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే IRCTC అకౌంట్‌లోని మై ప్రొఫైల్ సెక్షన్‌లో కూడా ప్రయాణికుల వివరాలు సేవ్ చేయవచ్చు. ఈ ఆప్షన్‌ ద్వారా ఒక్క క్లిక్‌తో పని పూర్తవడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.

సిద్ధంగా ఉండాలి

తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ప్రయాణికులు స్లాట్‌ టైమ్‌కు ముందే సిద్ధంగా ఉండాలి. వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల బుకింగ్‌ చేసేటప్పుడు దశల వారీగా అనుసరించాల్సిన సూచనలు, ట్యాబ్‌ల విషయంలో గందరగోళం చెందరు.

ముందుగానే లాగిన్ కావడం

తత్కాల్ టికెట్లు బుకింగ్‌కు అందుబాటులో ఉంచడానికి కొన్ని నిమిషాల ముందే లాగిన్ అవ్వాలి. స్టేషన్ కోడ్, బెర్త్ ను ముందే ఎంచుకోవాలి. బుకింగ్స్ మొదలైన వెంటనే మాస్టర్ లిస్ట్ నుంచి ప్రయాణికుల పేర్లను ఎంచుకుని, నేరుగా పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లాలి.

బ్యాంక్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి

ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారు పేమెంట్ కోసం బ్యాంక్ వివరాలను సిద్ధంగా ఉంచాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా OTP లేకుండా పేమెంట్ చేసే ఆప్షన్‌లను ఎంచుకోవడం మంచిది. OTP కోసం రిజిస్టర్డ్ మొబైల్‌ను కూడా సిద్ధం చేసుకోవాలి.

ఎక్కువ టికెట్లు ఉండే రైళ్లను ఎంచుకోవడం

ఎక్కువ టికెట్లు అందుబాటులో ఉండే రైళ్లను ఎంచుకోవడం వల్ల బుకింగ్ కోటా పెరుగుతుంది. తత్కాల్ టిక్కెట్లు ఎక్కువగా అందుబాటులో ఉండే రైలులో ప్రయాణికులు సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

రెండు బ్రౌజర్లలో లాగిన్ కావద్దు

వేగంగా టికెట్ బుకింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణికులు ఒకే ఐడీతో రెండు వేర్వేరు బ్రౌజర్‌లలో లాగిన్ అవుతారు. కానీ దీనివల్ల బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఒక బ్రౌజర్ పనిచేయకపోతేనే, వేరే బ్రౌజర్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.

First published:

Tags: Indian Railway, IRCTC, IRCTC Tourism

ఉత్తమ కథలు