FM NIRMALA SITHARAMAN UNION BUDGET 2021 TEAM PHOTO GETTING VIRAL IN SOCIAL MEDIA HSN
Union Budget 2021: నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్ ను చూశారా..? మొత్తం ఎంత మంది సభ్యులు ఉన్నారంటే..
నిర్మలా సీతారామన్(ఫైల్ ఫొటో)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే ఆ బడ్జెట్ (Union Budget 2021) ప్రతుల్లోని అంశాలను తయారు చేసిందెవరు.? నిర్మలమ్మ చెప్పిన అంశాలతో బడ్జెట్ ను తుదిరూపు తీసుకురావడానికి కష్టపడిందెవరు? అన్నది తెలుసుకునేందుకు కూడా నెటిజన్లు ఆసక్తికనపరుస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటున్న సమయంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మధ్యతరగతి వర్గం, సామాన్య ప్రజలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, వైద్య రంగం.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలు కూడా తమ వాటాగా బడ్జెట్ లో ఏం లభించబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో తమకు లభించబోయే కేటాయింపుల గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత రీతిలో ఈ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో అసలు బడ్జెట్ ను రూపొందించిన వారు ఎవరు? నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే ఆ బడ్జెట్ ప్రతుల్లోని అంశాలను తయారు చేసిందెవరు.? నిర్మలమ్మ చెప్పిన అంశాలతో బడ్జెట్ ను తుదిరూపు తీసుకురావడానికి కష్టపడిందెవరు? అన్నది తెలుసుకునేందుకు కూడా నెటిజన్లు ఆసక్తికనపరుస్తున్నారు.
బడ్జెట్ రూపకల్పన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ టీమ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వ ఐడియాలజీని గుర్తెరిగి, కేంద్ర ఆర్థికమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఆ బడ్జెట్ రూపకల్పనకు ఆ టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతుండగా, ఆ బడ్జెట్ ను రూపకల్పనలో ఆమెకు సహయపడిన వారు ఎవరు.? అన్నది ఆసక్తికరంగా మారింది. అంత కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడం అనేది కూడా మంచి పద్ధతే కాబట్టి, నిర్మలా సీతారామన్ కూడా తన బడ్జెట్ టీమ్ ను మీడియా ముందుకు తెచ్చారు. ఆదివారం సాయంత్రం తన టీమ్ తో కలిసి ఫొటోలు దిగారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్
నిర్మలా సీతారామన్ తన టీమ్ తో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిపి మొత్తం 18 మంది ఉన్నారు. ఈ సభ్యులే నేటి బడ్జెట్ కు తుది రూపకర్తలు. వివిధరంగాల్లో నిష్ణాతులైన వీరు, బడ్జెట్ ను జనరంజకంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. మరి వీరు రూపొందించిన ఈ బడ్జెట్ లో ఏమేం అంశాలు ఉన్నాయో, ఏఏ రంగాలకు పెద్ద పీట వేశారో, కరోనాతో అతలాకుతలం అయిన రంగాలకు ఏమేరకు స్వాంతన చేకూర్చారో తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.