మెలానియా ట్రంప్ డ్రెస్‌పై కమలం పూలు.. అసలు కథ ఇదే

భారత జాతీయ చిహ్నానికి గౌరవ సూచకంగా ఆ డ్రెస్ ధరించిందని.. అంతేకాదు కమలం బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో.. ఇటు దేశ ప్రజలు, అటు బీజేపీ మనసులను గెలించిందని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.

news18-telugu
Updated: February 25, 2020, 3:51 PM IST
మెలానియా ట్రంప్ డ్రెస్‌పై కమలం పూలు.. అసలు కథ ఇదే
మెలానియా ట్రంప్ డ్రెస్‌పై కమలం పూలు
  • Share this:
ఇండియా పర్యటనలో భాగంగా మంగళవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ధరించిన దుస్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వాగత కార్యక్రమంలో మెలానియా వైట్ కలర్ ఫ్లవి స్ప్రింగ్ డ్రెస్‌లో మెరిశారు. వైట్ షర్ట్ డ్రెస్, రెడ్ బెల్ట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐతే మెలానియా షర్ట్ డ్రెస్‌ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అందులో కమలం పూలు కనిపిస్తాయి. గులాబీ, కాషాయం, నీలి రంగు ఎంబ్రాయిడరీ కమలం పూలు ఆమె దుస్తులపై కనిపించడంతో.. ఏంటీ కథంటూ జోరుగా చర్చ జరుగుతోంది.

కమలం పువ్వు మన జాతీయ పుష్పం. అంతేకాదు బీజేపీ అధికారిక చిహ్నం కూడా కమలమే. ఈ నేపథ్యంలో మెలానియా ఆ కమలం పూల దుస్తులను ఎందుకు ధరించి ఉంటుందని పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత జాతీయ చిహ్నానికి గౌరవ సూచకంగా ఆ డ్రెస్ ధరించిందని.. అంతేకాదు కమలం బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో.. ఇటు దేశ ప్రజలు, అటు బీజేపీ మనసులను గెలించిందని ఎవరికి వారు ఊహించుకుంటున్నారు.

మరి ఇంతలా ప్రజల దృష్టిని ఆకర్షించిన మెలానియా ట్రంప్ కమలం పూల డ్రెస్ ధరెంతో తెలుసా..? దాదాపు 1.15లక్షల రూపాయలు. మొత్తంగా ఇండియా టూర్‌ కోసం ప్రత్యేక వస్త్రాలను మెలానియా ఎంచుకున్నారు. ఇండియాకు ప్రయాణమయ్యే సమయంలో ఇండో-అమెరికన్ డిజైనర్ రూపొందించిన చెక్కర్డ్ ప్యాంట్స్ ధరించారు. సోమవారం అహ్మదాబాద్‌లో ల్యాండైన సమయంలో భారత విశేషాలను గుర్తు చేసే ఓ సాష్ కూడా ధరించారు. ఇలా ఫ్యాషన్ ద్వారా భారత్‌తో దౌత్యనీతిని ప్రదర్శించారని మెలానియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు