రూ.10 కోట్లు ఇస్తే... ఓ ఊరికి మీ పేరు.. సీఎం సంచలన ఆఫర్

వరద సాయం కింద రూ.10 కోట్లు విరాళం ఇచ్చే వారికి.. ఆ ఊరిని దత్తత తీసుకున్నవారిగా ప్రకటిస్తామని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు.

news18-telugu
Updated: August 15, 2019, 5:43 PM IST
రూ.10 కోట్లు ఇస్తే... ఓ ఊరికి మీ పేరు.. సీఎం సంచలన ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు రూ.10 కోట్లు విరాళం ఇస్తే.. ఇప్పుడు ఉన్న ఊరికి ఆ పేరు తీసేసి మీ పేరు పెడతారు. ఔను. ఇది నిజంగా నిజం. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ ఆఫర్ ఇస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో భారీ ఎత్తున వరదలు ముంచెత్తాయి. 23 జిల్లాల్లోని 200కు పైగా గ్రామాలపై వరద ప్రభావం ఉంది. అక్కడ భారీ ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొల్పాలంటే పెద్ద ఎత్తున ధనం అవసరం. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ ఆఫర్ ప్రకటించారు. బెంగళూరులోని విధానసౌధలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వరద సాయం కింద రూ.10 కోట్లు విరాళం ఇచ్చే వారికి.. ఆ ఊరిని దత్తత తీసుకున్నవారిగా ప్రకటిస్తామన్నారు.

ఈ పథకం ద్వారా వరద ప్రాంతాల్లో సహాయకచర్యలకు అవసరమైన నిధులు సమకూరతాయని ముఖ్యమంత్రి భావించారు. కర్ణాటక వరదలతో సుమారు 6.97లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది. వారిని 1,160 రిలీఫ్ క్యాంప్‌ల్లోని 56,000 తాత్కాలిక గృహాలకు తరలించారు. ఇలాంటి కష్టసమయాల్లో అందరూ ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని యడియూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...