అక్కడకు విమానంలో వెళ్తున్నారా? అయితే బీ అలర్ట్..

అక్కడకు విమానంలో వెళ్తున్నారా? అయితే బీ అలర్ట్..

ఢిల్లీ ఎయిర్‌పోర్టు(ఫైల్)

ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పొగమంచు వల్ల 50 మీటర్ల దూరంలోని విమానాలు కూడా కనిపించలేదు.

 • Share this:
  ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఎక్కడ చూసిన పొగమంచే కనిపించడంతో.. జనంకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలు పొగమంచు కారణంగా ఇతర ప్రాంతాలకు, నగరాలకు దారి మళ్లించారు.

  ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పొగమంచు వల్ల 50 మీటర్ల దూరంలోని విమానాలు కూడా కనిపించలేదు. మరోవైపు పొగమంచుతోపాటు శీతల గాలుల ప్రభావం వల్ల విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు వాయు కాలుష్యం ఢిల్లీని కమ్మేసింది. దీనివల్ల ఢిల్లీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.  జెట్ ఎయిర్ వేస్, ఇండిగో సంస్థలు... పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ ఆలస్యం అవుతుందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాయి. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామన్నాయి. విమానాల రాకపోకల సమయంలో మార్పులు జరిగినట్లు తెలిపాయి. విమానాల రాకపోకల సమయాన్ని రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించాయి. ప్రయాణికులంతా ఒకసారి ఫ్టైట్ టైమింగ్స్ చెక్ చేసుకోవాలంటూ కోరాయి.

  మరోవైపు రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఢిల్లీకి వచ్చే 12 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాతావరణంలో మార్పుల వల్లే రైళ్ల ఆలస్యానికి కారణమన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ వాసులంతా చలికి గజ గజ వణికిపోతున్నారు.
  First published: