శ్రీనగర్‌లో నిలువు దోపిడీ... టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచేసిన విమాన సంస్థలు

Operation Kashmir : సరైన టైమ్ చూసి... టికెట్ల రేట్లు పెంచేశాయి శ్రీనగర్‌లో విమాన సంస్థలు. కాశ్మీర్ నుంచీ వెళ్లిపోతున్న పర్యాటకులు, విద్యార్థులకు అధిక రేట్లు వడ్డించేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 7:45 AM IST
శ్రీనగర్‌లో నిలువు దోపిడీ... టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచేసిన విమాన సంస్థలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Operation Jammu and Kashmir : జనరల్‌గా జమ్మూకాశ్మీర్‌లో అల్లర్లు జరిగినప్పుడు... ప్రజలు, పర్యాటకులూ పెద్ద ఎత్తున అక్కడి నుంచీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితి వేరు. కేంద్ర ప్రభుత్వం అక్కడ పెద్ద సంఖ్యలో బలగాల్ని మోహరిస్తుంటే... ఏదో జరగబోతోందనే టెన్షన్‌లో ప్రజలు, పర్యాటకులు జమ్మూకాశ్మీర్ నుంచీ ఇతర రాష్ట్రాలకు, సొంత ఊర్లకూ వెళ్లిపోతున్నారు. దాంతో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అఫ్‌కోర్స్ బస్ స్టేషన్లలోనూ అదే రద్దీ ఉంది. విమానాశ్రయంలో మాత్రం రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అసలు టికెట్లు దొరకట్లేదు. దొరికినా చాలా ఎక్కువ రేటు ఉంటున్నాయి. ఉన్నట్టుండి అంతలా పెంచేయడంతో టూరిస్టులు, ప్రయాణికులు చాలా బాధపడుతున్నారు. ఈ నిలువు దోపిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని కోరుతున్నా... పట్టించుకునే వాళ్లే లేరు. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. మరికొన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. ఏంటీ ఈ దోపిడీ అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా సీరియస్ అయ్యారు.


ప్రస్తుతం కాశ్మీర్‌ లోయలో రిసార్టులు, హోటళ్లు ఖాళీ అవుతున్నాయి. అమర్ నాథ్ యాత్రికులతోపాటూ... పర్యాటకులు కూడా అక్కడి నుంచీ వెళ్లిపోతున్నారు. దయచేసి టికెట్ల రేట్లు పెంచవద్దని విమాన సంస్థల్ని కోరారు పౌర విమానయాన శాఖ మంత్రి. అయినప్పటికీ ఆయన మాట పట్టించుకునే పరిస్థితుల్లో లేవు విమాన సంస్థలు. అడ్డగోలుగా దోచుకోవడానికి ఇదే సరైన టైమ్ అన్నట్లుగా రేట్లు పెంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాత్రికులు, పర్యాటకులు, ప్రజలు, భక్తులు.
ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారా సంస్థలు మాత్రం తాము రేట్లు పెంచలేదని తెలిపాయి. మామూలుగా కాశ్మీర్‌ నుంచి ఢిల్లీకి ఛార్జీ రూ.3వేల నుంచి రూ.5వేల దాకా ఉంటుంది. శనివారం కాశ్మీర్‌ నుంచి ఢిల్లీకి విస్తారా ఎయిర్‌లైన్స్‌ టికెట్‌ ధర రూ.37,915గా ఉంది. మిగతా బుకింగ్‌ సైట్లలో మాత్రం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి టికెట్‌ ధర రూ.15వేల నుంచి రూ.20వేలుగా ఉంది. దీన్ని బట్టీ దోపిడీ ఎలా సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...