Home /News /national /

FIVE YEARS UNTIL MAOISTS DEVOLVE INTO AFGHAN LIKE GANGS LAST DITCH PEACE INITIATIVE IN CHHATTISGARH NK

మావోయిస్టుల హింసకు చెక్ పెట్టేదెలా... గిరిజనుల నుంచి అభిప్రాయ సేకరణ

మావోయిస్టుల హింసకు చెక్ పెట్టేదెలా... గిరిజనుల నుంచి అభిప్రాయ సేకరణ (symbolic image)

మావోయిస్టుల హింసకు చెక్ పెట్టేదెలా... గిరిజనుల నుంచి అభిప్రాయ సేకరణ (symbolic image)

భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న కాల్పులు, హింస వల్ల జరుగుతున్న నష్టాలు, పరిష్కార మార్కాలపై గోండి, హల్బీ, హిందీ భాషల్లో గిరిజనుల నుంచి NPP ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది.

    ఆప్ఘనిస్తాన్ తరహాలో... ఇండియాలో మావోయిస్టులు గ్యాంగులుగా మారతారు. కమాండర్లు ఆ గ్యాంగుల్ని నడిపిస్తారు. ఐదేళ్లలో ఇలా జరుగుతుంది అని సుభ్రాన్షు చౌదరి తెలిపారు. చౌదరీ... దశాబ్దకాలానికి పైగా... గార్డియన్‌గా విధులు నిర్వహించారు. అలాగే... బీబీసీ సౌత్ ఆసియా బ్యూరోలో టీవీ, రేడియో ప్రొడ్యూసర్‌గా చేశారు. సరికొత్త శాంతి ప్రక్రియ (న్యూ పీస్ ప్రాసెస్ - NPP) కోసం ఆయన... గత మూడేళ్లుగా పనిచేస్తున్నారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో గిరిజనుల ప్రాణాలు పోకుండా సుభ్రాన్షు చౌదరి... వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న కాల్పులు, హింస వల్ల జరుగుతున్న నష్టాలపై గోండి, హల్బీ, హిందీ భాషల్లో గిరిజనుల నుంచి NPP ఓ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఈ హింసకు చెక్ పెట్టాలంటే ఏం చెయ్యాలో చెప్పాలని వారిని కోరింది.

    "వచ్చే ఐదేళ్లలో ప్రధాన మావోయిస్టు నాయకులు ఎప్పుడైనా చనిపోవచ్చు. ఆ తర్వాత... వారి సంస్థ డౌన్ ఫాల్ అవుతూ... స్థానిక కమాండర్ల చేతిలోకి వెళ్తుంది. ఎందుకంటే మావోయిస్టులకు రాజకీయాల్లో లాగా వారసత్వాలు లేవు. జార్ఖండ్, ఆప్ఘనిస్తాన్‌లో లాగే... ఇండియాలో కూడా భద్రతా బలగాలతో గ్యాంగులే యుద్ధానికి దిగుతాయి. దాని వల్ల తీవ్రమైన ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ హింసకు చరమగీతం పాడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని చౌదరి తెలిపారు.

    ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చివరి ప్రయత్నంగా చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులంతా... 7477288444 నంబర్‌కి కాల్ చేసి... తమ అభిప్రాయం చెప్పమని కోరుతున్నారు. ఇందుకోసం గిరిజనులు తమకు వచ్చిన లాంగ్వేజీలో చెప్పొచ్చు. చర్చల ద్వారా ఈ హింస ఆగుతుందా లేదా సైనిక చర్యల ద్వారా హింస ఆగుతుందా అన్నది వారు చెప్పాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 వరకూ ఈ మొబైల్ నంబర్ పనిచేస్తూ ఉంటుంది. గాంధీ జయంతి రోజున ఈ-ర్యాలీ నిర్వహించి... NPP... బ్రేక్ ది సైలెన్స్ సర్వే ఫలితాల్ని బయటపెడుతుంది.

    "చైకిల్ మాండీ అనే పేరుతో... వరుస సమావేశాలు నిర్వహించే ప్రక్రియ సగం పూర్తైంది. చైకిల్ మాండీ అంటే... గోండీ భాషలపో... శాంతి, ఆనందం కోసం సమావేశం అని అర్థం. ఈ సమావేశాల్లో హింసల్లో బాధితుల్ని ఆహ్వానిస్తాం. అందర్నీ టేబుల్ దగ్గర కూర్చోబెడతాం. తమ అభిప్రాయం చెప్పమని కోరతాం. హింసను ఎలా ఆపాలో చెప్పమంటాం" అని చౌదరి తెలిపారు.

    గిరిజనులు ఈ సర్వేలో చేరడం వల్ల వాస్తవాలు తెలుస్తాయి. గత 20 ఏళ్లలో మావోయిస్టుల హింసలో 12000 మంది ప్రజలు, 2700 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 50వేల మందికి పైగా గిరిజనులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ హింసపై ఎవరూ మాట్లాడట్లేదు. అభిప్రాయం చెప్పట్లేదు. అలా చెప్పేలా మేం ప్రయత్నిస్తున్నాం అని చౌదరి అన్నారు.

    CGNET ప్రోగ్రాం ద్వారా... ఇప్పటికే చౌదరి... గిరిజన గూడేల్లో అవగాహన కల్పిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు, రేడియో సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే స్థానిక సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో వాణి వినిపించే ఛాన్స్ అడవి పుత్రులకు వచ్చింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Maoist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు