మావోయిస్టుల బీభత్సం...కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృతి

మావోయిస్టు ఘాతుకాన్ని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల త్యాగాలు వృథాకావని..మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

news18-telugu
Updated: June 14, 2019, 9:01 PM IST
మావోయిస్టుల బీభత్సం...కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 14, 2019, 9:01 PM IST
జార్ఖండ్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారు. మావోయిస్టుల మెరుపు దాడిలో ఐదుగురు పోలీసులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం పోలీసుల వద్ద నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ దుశ్చర్యలో ఇద్దరు నక్సలైట్లు పాల్గొనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బీహార్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది.

సరైకెలా జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మావోయిస్టు ఘాతుకాన్ని జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల త్యాగాలు వృథాకావని..మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఇక చివరి రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. కాగా, ఇదే నెలలో డుమ్కాలో సశస్త్ర సీమ బల్ దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ చనిపోయారు.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...