ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు మావోయిస్టులు హతం

దంతెవాడ జిల్లాలోని కటేకల్యాన్ అడవిలో మందుపాతర పేల్చారు. అక్కడి పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈపేలుడు జరిగింది.

news18-telugu
Updated: November 12, 2018, 6:11 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు మావోయిస్టులు హతం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లో ఓవైపు పోలింగ్ జరుగుతుంటే, ఎన్నికల్ని బహిష్కరించాలని ప్రకటించిన మావోయిస్టులు హింసకు తెగబడాలని చూశారు. బిజాపూర్ పమేద్ ఏజెన్సీలోకి పెద్ద సంఖ్యలో ఎంటరయ్యారు. అలర్టైన
కోబ్రా బెటాలియన్లు కూంబింగ్ చేపట్టడంతో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. కోబ్రా దళాలు సైతం ఫైరింగ్ చెయ్యడంతో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చివరకు ఐదుగురు మావోయిస్టులు

హతమవ్వగా, కోబ్రా దళానికి చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని బీజాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరికొంత మంది మావోయిస్టులు పారిపోయినట్లు తెలిసింది.

ఛత్తీస్‌గఢ్‌ తొలి దశ ఎన్నికల్ని అడ్డుకోవడానికి మావోయిస్టులు రకరకాలుగా యత్నించారు. చాలా చోట్ల వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. కచ్చితంగా హింస చెలరేగవచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో, ప్రభుత్వం
లక్ష మందితో భారీ భద్రతను కల్పించింది. ఇంత చేసినా మావోయిస్టుల దుశ్చర్యలు ఆగలేదు. దంతెవాడ జిల్లాలోని కటేకల్యాన్ అడవిలో మందుపాతర పేల్చారు. అక్కడి పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్
దూరంలో ఈపేలుడు జరిగింది. ఓటర్లను భయపెట్టేందుకే దాన్ని పేల్చినట్లు పోలీసులు భావించారు. అటువైపు కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ తనిఖీలు చేసిన పోలీసులు, ఆరు మందుపాతర్లను బయటకు తీశారు. మొత్తానికి సమస్యాత్మక ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ ముగియడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 12, 2018, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading