తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా వేప్పూర్‌లో రహదారిపై వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతుల కారు పూర్తిగా నుజ్జు నుజ్జైంది. ఈఘటన వేప్పూర్ సమీపంలో జరిగింది. మొత్తం ఐదు వాహనాలు ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా కారులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపైన వాహనాల్ని క్లియర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Tamilnadu, VIRAL NEWS