లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత పలు చోట్ల ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దహేజ్‌లో పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరో 60మందికి పైగా గాయపడ్డారు. పేలుడు అనంతరం పరిశ్రమ నుంచి విష వాయువులు వెలువడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలానికి 10కిపైగా అగ్నిమాపక యంత్రాలు చేరుకొని మంటలను అదుపుచేశాయి.
Five people lost their lives & 57 others sustained injuries in a fire that broke out following a blast in a tank at Yashashvi Rasayan Pvt Ltd in Dahej Industrial Estate of Bharuch, Gujarat at about 12 PM today: Bharuch district collector Dr MD Modiya https://t.co/6A0e3T70dPpic.twitter.com/8W6gIh1a3M
పేలుడు తర్వాత ఫ్యాక్టరీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో తీవ్ర భయభ్రాంతులు నెలకొన్నాయి.యశశ్వి ఆగ్రో-కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అక్కడ 15 రకాల రసాయనాలు ఉత్పత్తి అవుతాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని భారుచ్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.