మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటి వరకు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ‘సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం జరిగిన భవనంలో ఐదు కాలిన మృతదేహాలను వెలికి తీశారు.’ అని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. మరోవైపు అక్కడి నుంచి 9 మందిని నిర్మాణంలో ఉన్న భవనం నుంచి బయటకు తరలించారు. కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే ప్రదేశానికి ఇది కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూణెలో ఉన్న ప్లాంట్‌లో టెర్మినల్ 1 గేట్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. 10 ఫైరింజన్లు వెంటనే వచ్చాయి. మంటలను ఆర్పుతున్నారు. అయితే, ప్రాథమికంగా అక్కడ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియలేదు. కానీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఉంటాయని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పొగలు మాత్రం వ్యాపించాయి.
10 ఫైరింజన్లు రంగంలోకి ిగి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కంట్రోల్లోకి తెచ్చారు. అయినా రెండు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. సెజ్ 3 భవనంలో నాలుగు, ఐదు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి. ప్లాంట్‌లో ఉండే అగ్నిమాపక యంత్రాలతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. అయితే, మొదట దీనిపై స్పందించిన సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. మొత్తం మంటలు ఆర్పిన తర్వాత చెక్ చేస్తే అక్కడ మృతదేహాలు కనిపించాయి.
ఐదుగురు చనిపోయిన ఘటనపై పూనావాలా స్పందించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనిపై మరింత విచారణ జరుగుతోందని చెప్పారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదంతో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందా అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. అలాగే, వ్యాక్సిన్ ఏమైనా మంటల్లో తగలబడ్డాయేమోననే సందేహాలు కూడా వచ్చాయి. వీటిపై అదర్ పూనావాలా స్పందించారు. ‘ప్రభుత్వానికి, ప్రజలకు క్లారిటీ ఇస్తున్నారు. కోవిషీల్డ్ ఉత్పత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇప్పటికే చాలా ప్రొడక్షన్ బిల్డింగ్స్‌లో రిజర్వ్ చేసి పెట్టాం.’ అని అదర్ పూనావాలా ట్వీట్ చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 21, 2021, 19:30 IST